రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. రఫేల్ వివాదంలో సుప్రీంకోర్టు చేయని వ్యాఖ్యలను రాహుల్ పేర్కొనడంపై దుమారం రేగుతోంది. తన అభిప్రాయాలను న్యాయస్థానానికి అన్వయిస్తున్నారని బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈసందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ మీడియాలో పేర్కొనట్టుగా తాము వ్యాఖ్యానించలేదని, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించలేదని అన్నది. ఈనెల 22లోగా రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది.

దేశం మొత్తం చౌకీదారే దొంగ అంటోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా న్యాయం గురించి మాట్లాడుతోందని రాహుల్ కామెంట్ చేశారు. ఇదే అంశాన్ని మీనాక్షీ లేఖీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు తీర్పును తన సొంత ఆలోచనలతో ఆపాదించి, జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.