బిస్కెట్లు ఇచ్చి బంగారం దోచారు…. వరంగల్ లో ఆరుగురికి అస్వస్థత

యశ్వంత్ పూర్ నుంచి ఢిల్లీ వెళుతున్న సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ఆరుగురు ప్రయాణీకులను బురిడీ కొట్టించారు దొంగలు. మత్తు మందు ఇచ్చిన బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ ఇచ్చారు. వాళ్ళు స్పృహ తప్పాక బంగారం, నగదు దోపిడీ చేశారు. దాంతో ప్రయాణీకులను కాజీపేటలో దింపారు రైల్వే పోలీసులు. వారిని MGM హాస్పిటల్ కు తరలించారు.

అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్ దాటాక ఈసంఘటన జరిగింది. శనివారం అర్థరాత్రి దాటాక ఈ సంఘటన జరగింది. అయితే ప్రయాణీకులు దాదాపు 12 గంటల పాటు మత్తులోనే ఉండిపోయారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాటాక పోలీసులకు సమాచారం ఇచ్చారు తోటి ప్రయాణీకులు. దాంతో వారిని కాజీపేటలో దింపి MGM కి తరలించారు. బాధితులు కర్నాటక, బిహార్, ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు. ఈ చోరీలో ఆరు మొబైల్ ఫోన్లు, ఓ బంగారు ఉంగరం, దాదాపు 10వేల దాకా నగదు, పర్సులు దోచుకున్నారు దుండగులు. ధర్మవరం రైల్వే పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.