తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచన !

రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన జారీచేశారు అధికారులు. ఉత్తర ఇంటీరియర్ ఒడిశా నుంచి రాయలసీమ దాకా కోస్తా ఆంధ్ర మీదుగా 0.9 km ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

తెలంగాణ:

గురు, శుక్ర వారాల్లో పొడి వాతావరణం ఏర్పడుతుంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 40 నుంచి 50 km) తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.  ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

కోస్తా ఆంధ్ర:

రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు(గంటకు 30-40 km) తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో అక్కడక్కడ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముంది. శుక్ర, శనివారాల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:

గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.  ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. .