రోహిత్ శర్మకి తీవ్ర గాయం: IPL నుంచి ఔట్

వరల్డ్ కప్ లోనూ అనుమానమే

ప్రపంచ కప్ కు ముందుగా టీమిండియా ఓ కీలకమైన ఆటగాడిని కోల్పోనుంది. బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ తీవ్రంగా గాయపడటంతో ప్రస్తుతం జరుగుతున్న IPL తో పాటు ప్రపంచ కప్ క్రికెట్ కి కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ముంబై ఇండియన్స్ తరపున IPL లో ఆడుతున్న రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్ లో తీవ్రంగా గాయపడ్డాడు. బాధ తట్టుకోలేక మైదానంలో పడుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫిజియో నితిన్ పటేల్ వెంటనే రోహిత్ కు సపర్యలు చేశాడు. అయినా పరిస్థితి ఏ మాత్రం మార్పు రాకపోవడంతో… డ్రెస్సింగ్ రూమ్ కి రోహిత్ ను తరలించారు. ముంబై ఇండియన్స్ టీమ్ లో ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా కూడా గాయంతో జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ IPL 2019 సీజన్ లో ముంబై ఇండియన్స్ కి ఇది రెండో దెబ్బ. 11యేళ్ళ IPL చరిత్రలో మొదటిసారిగా రోహిత్ శర్మ మ్యాచుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మే 30 నుంచి ఇంగ్లండ్ లో జరిగే వరల్డ్ కప్ క్రికెట్ కోసం టీమిండియా జట్టును ఈనెల 15న BCCI ప్రకటించనుంది. కీలకమైన టైమ్ లో రోహిత్ శర్మ గాయపడటంతో అతన్ని ఎంపిక చేయడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.