యాక్షన్ మూవీస్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎక్కడలేని సంతోషం. అదే టైమ్ లో బాహుబలి రెండు సినిమాలతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో చేరుకుంది. బాహుబలి తర్వాత వస్తున్న సాహో మూవీపై ప్రేక్షకుల అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఎప్పుడు థియేటర్లకి వస్తుందా అని ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అంతెందుకు ఇన్నాళ్ళూ కనీసం టీజర్ బయటకు వస్తే చాలనుకున్నారు.

అంతే గురువారం ఉదయం సాహో టీజర్ ను రిలీజ్ చేశారు. ఒక్క గంటలోనే ఈ టీజర్ కి 23 లక్షల వ్యూస్ వస్తే… రిలీజైన ఆరుగంటల్లో ఆ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. రెండున్నర కోట్ల మంది టీజర్ చూశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ టీజర్ రిలీజ్ అయింది. డార్లింగ్ ప్రభాస్, నటి శ్రద్ధా కపూర్ మధ్య జరిగే చిన్న సంభాషణతో పాటు రిచ్ గా ఫైట్స్ ని కూడా ఈ టీజర్ లో చూపించారు. దాంతో ప్రభాస్ అభిమానుల ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ సాహో మూవీ కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ఇవాళ్టి టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే తెలుస్తుంది. బాహుబలి మూవీతో తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిన ప్రభాస్… ఇప్పుడు సాహోతో హాలీవుడ్ రేంజ్ కి ఎదిగిపోయాడని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ప్రభాస్ యాక్షన్ సీన్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సాహో మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.