నటి సాయి పల్లవి అందరి కంటే డిఫరెంట్. ఒక్క రిబ్బన్ కట్ చేస్తే లక్షలు, కోట్లు తీసుకునే ఈ రోజుల్లో… ఆమె సామాజిక కార్యక్రమాలకు డబ్బులు తీసుకోకుండానే వెళ్తుంది. అయితే సాయి పల్లవి ఇప్పటి దాకా ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా నటించలేదు. యాడ్స్ లో నటించబోనని ముందే చెప్పింది. అంతేకాదు… పిలిస్తే ఏ సామాజిక కార్యక్రమానికైనా అటెండ్ అవుతానంటోంది. ఇలా ప్రజాసేవపై ఇంట్రెస్ట్ ఉన్న సాయి పల్లవి ఇప్పుడు ఏకంగా రెండు కోట్ల రూపాయల డీల్ కు నో చెప్పింది. ఓ ప్రముఖ సంస్థ తమ ఫేస్ క్రీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని అడిగింది. అందుకోసం రూ.2కోట్లు ఇస్తానని చెప్పింది. అయితే మేకప్ వేసుకోకుండానే సినిమాల్లో చేస్తున్నాననీ… ఇప్పుడు ఫేస్ క్రీమ్ వాడమని ఎలా ప్రోత్సహిస్తానని అడిగింది సాయి పల్లవి. పోనీ… మేకప్ లేకుండానే నటించండి అని అడిగినా సరే… ఆమె నో చెప్పేసింది. తెలుగులో లక్షలమంది అభిమానులు కలిగిన సాయి పల్లవి ఇంత పెద్ద డీల్ వదులుకోవడంపై అంతా ఆశ్చర్య పోతున్నారు.