ఎండలు పెరుగుతున్నాయి ..జాగ్రత్త !!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం వేళల్లో అక్కడక్కడా చిరు జల్లులు పడుతున్నా.. వాటితో జనానికి పూర్తి స్థాయిలో రిలీఫ్ దక్కడం లేదు. చాలా ఏరియాలో 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే ఏం చేయాలో చూద్దాం.

వడదెబ్బ లక్షణాలు ఏంటి ?

*చమట పట్టడం
*శరీరం పొడిబారడం
*తలనొప్పి, దురదలు
*వాంతులు, స్పృహ కోల్పోవడం

వడదెబ్బ తగిలితే ఏం చేయాలి ?

వడదెబ్బ తగిలిన పేషెంట్ ను ముందుగా చల్లబరిచే ప్రయత్నం చేయాలి. శరీరాన్ని తడిగుడ్డతో తుడవడం చేయాలి. ఆ తర్వాత ఐస్ వాటర్ తో తడిపిన బట్టలను కప్పాలి. భుజాల కింద చల్లని ఐస్ ముక్కలు ఉంచితే బెటర్. దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్ళాలి.

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే

రోజులో 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు తాగాలి. సాధారణంగా ఎండలో తిరగడం మానేయాలి. తప్పనిసరి పరిస్థితి అయితే… ఉదయం, సాయంత్రం వేళల్లో వెళ్ళాలి. మిట్ట మధ్యాహ్నం వేళ ఎండలకు తిరగకపోవడమే బెటర్. వేసవి కాలంలో ఎప్పుడైనా తెల్లని దుస్తులు లేదా కాటన్ బట్టలే వేసుకోవాలి.
చాలామంది హోమియో డాక్టర్లు Natrum Mur 200 మందును 3 రోజులకు 6 పిల్స్ చొప్పున వడదెబ్బ తగలకుండా వాడమని చెబుతారు. పిల్లలకైతే వయసును బట్టి వాడాలి.

ఆయుర్వేదంలో వడదెబ్బకి ఔషధం

సుగంధ పాల వేళ్ళు, వట్టి వేళ్ళ చూర్ణం 20 గ్రాముల చొప్పున తీసుకొని… నీళ్ళతో కాగబెట్టి… వడపోసి ఆ నీళ్ళల్లో ఒక చెంచా పటిక బెల్లం చూర్ణం కలుపుకొని రోజుకి రెండు, మూడు సార్లు తాగుతుంటే వడదెబ్బ పోవడమే కాకుండా… మానసినక ఉల్లాసం, మనో నిగ్రహ శక్తి పెరుగుతుంది. ఇది నిత్యం వాడితో ఢోకా లేదు.