గూగుల్, యాపిల్ యాప్ స్టోర్స్ నుంచి టిక్ టాక్ యాప్ ను తొలగించారు. చైనాకి చెందిన ఈ సోషల్ మీడియా యాప్ లో అశ్లీల చిత్రాలు, వీడియోలు చెలామణి అవుతుండటంతో దీన్ని తొలగించాలని 2019 ఏప్రిల్ 3న మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ జారీ చేసింది. దాంతో గూగుల్, యాపిల్ సంస్థలు తమ యాప్ స్టోర్స్ నుంచి టిక్ టాక్ ను తొలగించాయి.  అయితే కొందరు షేర్ ఇట్ ద్వారా ఈ యాప్ ను ఒకరి నుంచి ఒకరికి పంపుకుంటూ వాడుతున్నట్టు తేలింది.  అయితే ఇదే తరహాలో షేర్ చాట్ యాప్ కూడా పనిచేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో కూడా సెక్స్ కంటెంట్, అశ్లీల చిత్రాలు ఉన్నాయని దీన్ని కూడా తొలగించాల్సిందేనని పలువురు సామాజిక ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైనా కోర్టుకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారు. షేర్ ఛాట్ లో మిగతా అంశాలు బాగున్నప్పటికీ… 18+ కేటగిరీలో ఇచ్చే కంటెంట్ పైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.