TRS కోసం డబ్బులు పంచుతూ దొరికిన హోంగార్డ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

పరిషత్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ తరపున డబ్బులు దొరికిపోయాడో హోంగార్డ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం, రుద్రంపూర్ లో ఎన్నికల డ్యూటీ చేస్తున్నాడు. టీఆర్ఎస్ కి చెందిన సింగరేణి గుర్తింపు సంఘం నాయకుడు రాజక్ దగ్గర కొంత డబ్బులు తీసుకున్నాడు. ఉదయం నుంచి పోలింగ్ బూత్ కు వచ్చే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నాడు. పోలీసులు గానీ ఎన్నికల అధికారులు గానీ చోద్యం చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ మాట్లాడలేదు.  అతడిని అడ్డుకోలేదు.  స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేస్తున్న వేముల రాజ్యలక్ష్మి కూడా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదు. దాంతో ఆమే స్వయంగా డబ్బులు పంచుతున్న హోంగార్డుతో పాటు, TBGKS నాయకుడు రాజక్ ను  పోలింగ్ బూత్ దగ్గర చితకబాదడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి చర్యలు తీసుకున్నారు. రాజ్యలక్ష్మి తెగువను అక్కడున్న విద్యావంతులు మెచ్చుకున్నారు.