టీఆర్ఎస్ కి ఓటెయ్యకపోతే మిమ్మల్ని కుక్కలు కూడా చూడవు

: ఖమ్మం జిల్లా ప్రచారంలో తుమ్మల కామెంట్స్
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ఎన్నికల ప్రచారంలో ఓటర్లపై మండిపడ్డారు. ఈసారి టీఆర్ఎస్ కి ఓట్లెయ్యకపోతే మిమ్మల్ని కుక్కలు కూడా చూడబోవని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ కి కాకుండా ఎవరికి ఓట్లేసినా అది మురికి కాలువలో కొట్టుకుపోయినట్టేనన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కష్టపడ్డా… తనను అవమానించారని ఓటర్లపై అసహనం ప్రదర్శించారు తుమ్మల. అన్ని అసెంబ్లీ సీట్లు గెలిచి సీఎం కేసీఆర్ కి గిఫ్ట్ ఇద్దామనుకున్నానని అన్నారు. ఈసారైనా నామా నాగేశ్వరరావుని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో 16 సీట్లు గెలిస్తే సీఎం కేసీఆర్ కేంద్రం కీ రోల్ పోషిస్తారని చెప్పారు మాజీ మంత్రి తుమ్మల.

తుమ్మల కామెంట్స్ కోసం ఈ వీడియో చూడండి

Please like Face Book page:

https://www.facebook.com/Telugu-word-862539437419486/

Please like Face Book page:

https://www.facebook.com/Telugu-word-862539437419486/