ఉపాధ్యాయ అభ్యర్థుల గోస : మహబూబ్ నగర్ లో భిక్షాటన

మహబూబ్ నగర్ జిల్లా: రెండేళ్ళయినా TRT రిక్రూట్ మెంట్ ఓ కొలిక్కి రాకపోవడంతో నిరుద్యోగులు గోస పడుతున్నారు. మెరిట్ లిస్ట్ ప్రకటించినా… కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిరసనగా మహబూబ్ నగర్ లో వివిధ జంక్షన్లలో భిక్షాటన కార్యక్రమంతో నిరసన తెలిపారు 2017 TRT క్వాలిఫైడ్ అభ్యర్థులు. ఈనెల 20 లోపు కౌన్సెలింగ్ నిర్వహించకపోతే 8,792 మంది అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదంటున్నారు ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు.