అమెరికాలో భయంకర తుఫాన్

అమెరికా దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన భయంకర తుఫాన్ ధాటికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్, వాషింగ్టన్, అట్లాంటాల్లో ఉంటున్న 9కోట్ల మందికి ఈ తుఫాన్ ముప్పుగా మారింది. భార వర్షం, వడగళ్లతో పాటు భయంకరమైన గాలులు కూడా వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పెద్ద పెద్ద వడగళ్ళు పడే ఛాన్సుందనీ… కొన్ని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు కూడా పొంచి ఉందని చెబుతున్నారు. టెక్సస్ లో ఇప్పటికే ముగ్గురు పిల్లలతో పాటు మొత్తం ఐదగురు చనిపోయారు. టెక్సస్ లో రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది. కొన్ని చోట్ల వీధుల్లో చెట్లు కూకటి వేళ్లతో నేలకూలాయి… దాంతో ఫ్రాంక్లిన్, బ్రెడ్ మాండ్ ల్లో విద్యుత్ సరఫరాకి తీవ్ర అంతరాయం కలిగింది.