210 మండలాల్లో వడగాల్పుల ప్రమాదం

అమరావతి: ఎండల తీవ్రత పెరిగడంతో ఏపీ రియల్‌ టైం గవర్నెన్స్‌(ఆర్టీజీఎస్‌) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రమంతటా 210 మండలాల్లో వడగాల్పుల ప్రమాదం ఉందని తెలిపింది. చిన్నారులు, వృద్ధులు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఈనెల 10 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని హెచ్చరించింది.
నిన్నటితో పోల్చుకుంటే మరో మూడు జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగినట్లు RTGS తెలిపింది. నెల్లూరులో 45 డిగ్రీలు, కృష్ణా జిల్లా తిరువూరులో 44 డిగ్రీలు, విశాఖ జిల్లా అనంతగిరిలో 30 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా గారలో 32 డిగ్రీలు, అనంతపురం గుదిబండలో 32 డిగ్రీలు, కృష్ణా జిల్లా కృత్తివెన్నులో 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.