విశాఖలో కిడ్నీ రాకెట్ !

విశాఖ కేంద్రంగా నడుస్తున్న కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. కిడ్నీ రాకెట్‌లో చాలామంది దళారీలు, ప్రైవేటు ఆస్పత్రులు, డబ్బులు ఆశ చూపి పేదల కిడ్నీలు దోచేస్తున్నారు. విశాఖలో కిడ్నీ రాకెట్ ఆగడాలు పెచ్చుమీరి పోయాయి. కిడ్నీ ఇస్తే రూ.12 లక్షలు ఇస్తామంటూ కూకట్‌పల్లికి చెందిన సెక్యూరిటీ గార్డు పార్ధసారధికి దళారి ఆశ చూపించాడు. కిడ్నీ తీసుకున్న తర్వాత రూ.ఐదు లక్షలు ఇచ్చి దళారి చేతులు దులుపుకున్నాడు. దళారిని బెంగళూరుకు చెందిన మంజునాథ్‌గా గుర్తించారు. కిడ్నీ తీసుకుని మోసగించారని బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో నిందితుడు మంజునాథ్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.