ఓట్లేస్తారా… వెహికిల్స్ రెడీ !!

ఆంధ్రప్రదేశ్ కి క్యూ కట్టిన ఓటర్లు 

కిక్కిరిసిపోతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు 

ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఇప్పుడు ఫుల్లు డిమాండ్ ఉంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ ఓటర్లను తీసుకొచ్చేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సుల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. దాంతో జనం ఓట్లెయ్యడానికి ఏపీకి వెళ్ళాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇటు TS RTC కూడా కొన్ని బస్సులను ఆంధ్రాకి నడుపుతోంది. అయినా జనానికి సరిపడా బస్సులు ఆంధ్రాకి లేవు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏ నియోజకవర్గం చూసినా… టీడీపీ, వైసీపీ మధ్య హోరా హోరీగా పోరాటం నడుస్తోంది. చాలా చోట్ల తక్కువ మెజార్టీతోనే అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ప్రతి ఓటు కూడా కీలకతంగా మారింది. ఇతర రాష్ట్రాల్లో ఆంధ్ర ఓటర్లు లక్షల్లో ఉంటారు. అందువల్ల ఏ ఒక్కర్నీ వదులుకోకూడదని భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర ఓటర్లను ఫోన్ చేసి మరీ పిలిపిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని తమ ఊళ్ళకి అడ్వాన్స్ బుకింగ్స్ చేయించుకుంటే సరి… లేకపోతే వెహికిల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాయి పార్టీలు. కొందరు కర్నూలుకు చెందిన ఓటర్లు ఇవాళో పార్టీ ప్రముఖుడికి తమకు ఓట్లెయ్యడానికి వెహికిల్స్ కావాలని అడిగారు. దాంతో ఆగమేఘాల మీద వాళ్ళకి వెహికిల్స్ సమకూర్చారు. ఇటు హైదరాబాద్ లో ప్రైవేటు వెహికిల్స్ ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. దాంతో వెహికిల్స్ అద్దెలు సాధారణ రోజుల కంటే డబుల్, త్రిబుల్ రేట్లు పలుకుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నాయి.