మీరు నీళ్ళు తాగుతున్నారా ? లేకపోతే ఏమవుతుంది ?

ఉదయం లేవగానే మీలో ఎంతమంది నీళ్ళు తాగుతున్నారు… నో… చాలామందికి ఆ అలవాటు ఉండదు. కానీ నీళ్ళు సరిగ్గా తాగకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఓసారి తెలుసుకోండి. మీరు దాహం వేసినప్పుడు నీళ్ళు తాగడం కాదు… ఓ క్రమ పద్దతి ప్రకారం రోజుకి 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు తాగితే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. చాలామంది ఉదయం నుంచి రాత్రి దాకా ఏసీ గదుల్లో ఉంటారు. పని హడావిడిలో మన పక్కనే బాటిల్ ఉన్నా ఒక్క లీటర్ నీళ్ళు కూడా తాగలేకపోతున్నారు. చాలామంది ఈ తప్పు చేస్తున్నారు. నీళ్ళు తాగడమంటే బద్దకంగా ఫీలయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. మన శరీరంలో మూడు వంతు నీళ్ళతోనే నిర్మాణమై ఉంటుంది. అందువల్ల మనం దానికి నీళ్ళు అందించకపోతే చాలా సమస్యలు వస్తాయి.
మీరు కూర్చొని లేవలేకపోతున్నారా… లేదంట కీళ్ళు, కండరాల నొప్పులతో బాధపడుతున్నారా… అయితే మీరు నీళ్ళు తక్కువగా తాగుతున్నట్టే. కీళ్ళ మధ్యలో కార్టిలేజ్ 80 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది. మీరు నీళ్లు తక్కువగా తాగినప్పుడు ఈ నొప్పుల వస్తాయన్నమాట.  అలాగే తలనొప్పి తరచుగా వస్తుందా… నీళ్లు తక్కువగా తాగినప్పుడు మీకు ఈ తలనొప్పి వేధిస్తుంది. ఆక్సిజన్ తక్కువగా అందడం, మెదడుకి రక్తం సరఫరా తగ్గడం లాంటివి డీహైడ్రేషన్ వల్లే కలుగుతాయి. దీంతో తలనొప్పి వస్తుంది. జీర్ణవ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. డీహైడ్రేషన్ వల్ల ఫ్లూయిడ్స్ తక్కువగా అందడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది.

అలసట, ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా లేకపోవటం కూడా నీళ్ళు తక్కువ అవడం వల్లే సమస్యలే. బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ సరిగా అందదు. ఇలాంటి లక్షణాలు కనిపించాయంటే శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగడం లేదనే చెప్పాలి.  అలాగే మీ శరీరం డీహైడ్రేట్ అయిందని తెలిపే ముఖ్య లక్షణం యూరిన్ కలర్. తరచుగా యూరిన్ కి వెళ్లకపోయినా.. సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని భావించాలి. రోజుకి 4 నుంచి 7 సార్లు యూరిన్ కివెళ్లాలి. యూరిన్ కలర్ ఎల్లో లో ఉందంటే నీళ్లు సరిగా తాగడం లేదని గుర్తించాలి.

బ్రెయిన్ ఫంక్షన్ పైనా నీళ్ళు తక్కువ తాగడం అనేది ప్రభావం చూపిస్తుంది. మీ మూడ్, మెమరీ, డెసిషన్, ఏకాగ్రత లాంటి వాటన్నింటిపైనా దీని ప్రభావం ఉంటుంది. పెదాలు ఆరిపోవడం , చర్మం మెరవకపోవడం, పొడిబారిపోవదటం లాంటివి జరుగుతాయి. అలాగే చెమట కూడా తక్కువగా పడుతోందని అంటే మీరు సరిగ్గా నీళ్లు తాగటం లేదని చెప్పొచ్చు.

అసలే ఎండాకాలం… ఇప్పటికైనా నీళ్లు బాగా తాగడం అలవాటు చేసుకోండి. దాంతో మీకు ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండటమే కాకుండా మీ ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి కూడా.