వచ్చే 3 రోజులకు వాతావరణ సూచన

తెలంగాణ నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 km ఎత్తు దగ్గర ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణ:

సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30 నుంచి 40 km) తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.  ఎల్లుండి ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

కోస్తా ఆంధ్ర:

రాగల మూడు రోజులు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30-40 km) తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముంది.  ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షం ఛాన్సుంది.

రాయలసీమ:

సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30-40 km) తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.  ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.