పాము లాగా గాలి దుమ్ము (వీడియో)

మనం ఏ అరబ్ కంట్రీస్ లోనూ అమెరికాలోనో చూసే అరుదైన దృశ్యం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కనిపించింది. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ వింత చోటు చేసుకుంది. వేడి గాలులతో స్టేడియంలోని దుమ్ము పైకి లేచి పాము ఆకారంలో పైకి లేచింది. స్టేడియం నాలుగు వైపులా నుంచి గాలి రావడంతో సుడిగాలి తీవ్రత ఎక్కువై ఏటావాలుగా దుమ్ము తో కూడిన గాలి ఆకాశం వైపు దూసుకెళ్లింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ స్టేడియం చుట్టు పక్కల ఉన్న జనం ఈ వింత దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. పది నిమిషాల దాకా ఈ సుడిగాలి పాము ఆకారంలో ఆకాశంలోకి ఎగబాకింది.

గాలి దుమ్ము వింత దృశ్యం వీడియోలో చూడండి