ఆ రెండు కేంద్రాల్లో జీరో పర్సంటేజ్ !

తెలుగు రాష్ట్రాల్లో రెండు పోలింగ్ కేంద్రాల్లో రికార్డులకెక్కాయి.  అక్కడ జీరో పర్సంటేజ్ ఓటింగ్ నమోదైంది.  అంటే ఆ రెండు పోలింగ్ కేంద్రాల్లో ఒక్కరు కూడా ఓటు వేయలేదు.  అవి  ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో అరకులో ఉన్నాయి.  మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.  దీనికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో కరపత్రాలు పంచడంతో పాటు పోస్టర్లు అంటించారు.  దాంతో అరకు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆ రెండు మారుమూలు గ్రామాల్లో ప్రజలు ఓట్లెయ్యడానికి ముందుకు రాలేదు.  మావోయిస్టుల హెచ్చరికలతో ఈ రెండు పోలింగ్ బూత్ లను వేరే చోటికి షిప్ట్ చేశారు అధికారులు.

పోలింగ్ కేంద్రం నెంబర్. 30 కలిగిన బంగన్ పేటలో 654 మంది ఓటర్లు ఉన్నారు.  అలాగే కుసుంపేటలో (పోలింగ్ బూత్ నెం.31) లో 393 మంద ఓటర్లు ఉన్నారు.  మొత్తం 25 గిరిజన గ్రామాలకు చెందిన ఓట్లు వీటిల్లో ఉన్నాయి.  అయితే నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా ఇక్కడ ఐదు ఓట్లు మాత్రమే పడ్డాయి.  విశాఖపట్నం జిల్లా పరిధిలో 70శాతం ఓటింగ్ పోల్ అయినా… మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న ఏరియాల్లో మాత్రం ఓట్లు వెయ్యడానికి అంతటా జనం ముందుకు రాలేదు.