తెలంగాణలో మరో ఎన్నికల జాతర

రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈనెల 22 తర్వాత జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. పంచాయతీ రాజ్ ఉన్నతాధికారులతో సీఎం జరిపిన సమీక్షలో ఈ ఎన్నికలపై చర్చ జరిగింది. ఈనెల 22 నుంచి మే 14 వరకూ పరిషత్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఫలితాలను మాత్రం లోక్ సభ ఎన్నికల రిజల్ట్స్ తర్వాతే వెల్లడిస్తారు. అంటే దేశమంతటా మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఆ తర్వాతే పరిషత్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు.

మూడు దశల్లో ఎన్నికలు

పరిషత్ ఎన్నికలను మూడు దశల్లో పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ముందుగా ఈనెల 20న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటిస్తారు. ఆ తర్వాత రెండు రోజులకు షెడ్యూల్ వెలువడుతుంది. ఏప్రిల్ 22న తొలి విడత నోటిఫికేషన్ విడుదలైతే మే 6న ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 26న రెండో విడత నోటిఫికేషన్ వెల్లడైతే మే 10న, ఆ తర్వాత మే 14న ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.