అక్కడకు వస్తే 7రోజుల పాటు క్వారంటైన్

కేరళ నుంచి అక్కడకు వస్తే 7రోజుల పాటు క్వారంటైన్
కేరళలో రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువ అవుతుడంటంతో అక్కడి కర్ణాటక సర్కార్ కరోనా పట్ల అప్రమత్తమవుతోంది. అయితే కేరళ నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రతి వారు తప్పనిసరిగా క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిందేనని చెబుతోంది. అయితే ప్రతి ఒక్క మనిషి 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని మరియు 7 రోజుల తర్వాత టెస్టింగ్ ఉంటుందని తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవడం తప్పనిసరిగా చేసిన సర్కార్. అయితే RT-PCR రిపోర్ట్‌తో సంబంధం లేకుండానే కేరళ విజిటర్లను క్వారంటైన్‌కు పంపాలని నిర్ణయించామని కర్ణాటక రెవిన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు.
కేరళతో సరిహద్దులో ఉన్న 4 జిల్లాలు మినహా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ నైట్ కర్ఫ్యూ సడలిస్తున్నట్టు తెలిపింది. కొడగు, హసన్, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లోనూ నైట్ కర్ఫ్యూ సడలించాలని సీఎం బసవరాజ్ బొమ్మై ఆదేశాలతో సడలించామని మంత్రి తెలిపారు.