అగ్రగామిగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎలక్ట్రిక్ బస్సులు

అగ్రగామిగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎలక్ట్రిక్ బస్సులు
బస్సులో 34 మంది ప్రయాణించే అవకాశం
ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయడంలో అగ్రగామిగా ఉన్న సంస్థల్లో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ ఒకటి. అయితే తాజాగా 50 ఎలక్ట్రిక్ బస్‌ల సరఫరా ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. ప్రస్తుత కాలంలో పెట్రోల్, డీజిల్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు బస్సులను నడపలేకపోతున్నాయి. తద్వారా ఆదాయం పడిపోతుంది. ప్రజలకు చేరువయ్యే దిశగా గుజరాత్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ఇందులో భాగంగానే ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీకి కొత్త బస్సులను ఆర్డర్ చేసింది. 10 ఏళ్ల కాలానికిగాను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో బస్‌లను 12 నెలల్లో గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (జీఎస్ఆర్టీసీ) అందజేయున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ తెలిపింది.
ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో ప్రయాణికుల కోసం ఒలెక్ట్రా తయారీ 200 ఈ–బస్‌లు నడుస్తున్నాయని కంపెనీ ఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. మళ్లీ కొత్తగా 50 ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ బస్సుల సరఫరాతో 1,350 బస్‌లకు చేరుకుంటామని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. అయితే ఈ బస్సులో 9 మీటర్ల పొడవుగా ఉంటుందని డ్రైవర్‌తో కలిపి 34 మంది ప్రయాణికులు కూర్చోవచ్చునని..లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే బస్ 180–200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు. 3–4 గంటల్లోనే చార్జింగ్ అవుతుందని… మా బస్సులకు త్వరలో చార్జింగ్ స్టేషన్లు పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నామని తెలిపారు.