ఆఫ్గానిస్తాన్ ఎయిర్ పోర్టులో  కాల్పులు, ఐదుగురిపైగా మృతి

ఆఫ్గానిస్తాన్ ఎయిర్ పోర్టులో  కాల్పులు, ఐదుగురిపైగా మృతి

ఆఫ్గానిస్తాన్  ఎయిర్ పోర్టులో  కాల్పులు, ఐదుగురిపైగా మృతి

కాబూల్‌: ఇటీవల ఆఫ్గానిస్తాన్ ను తాలిబన్లు వశంచేసుకోవడంతో అక్కడ మారణకాండ మోగుతోంది. తాలిబన్లు బీభత్సం సృష్టితారనే భయంతోనే అందరూ ఎయిర్ పోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అనుకున్నట్టుగానే ఆఫ్గానిస్తాన్ ప్రజల్ని తాలిబన్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రాణభయంతో విదేశాలకు పారిపోయేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్కడ ప్రజలు పారీపోయేందుకు బస్సులు, ట్రైన్లు ఫెసిలిటీ లేక అందరూ… కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎ‍త్తున ప్రజలు విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎవరి తోచిన ఫ్లైట్ లను వారు ఎక్కేందుకు ట్రై చేశారు.

ఎయిర్ పోర్టుకు ఒకేసారి వేలాదిమంది రావడంతో ఎయిర్ పోర్టు కిటకిటలాడింది. ప్రయాణికులను చక్కద్దిద్దేందుకు అక్కడ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృత్యువాత పడ్డారు. తాలిబన్లు మొత్తం దేశాన్ని ఆక్రమించుకోవడంతో చేసేది ఏమీ లేక అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ అఫ్గానిస్తాన్‌ వదిలి పరారయ్యాడు. భయంతో అక్కడి ప్రజలు కూడా దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. దేశానికి ఉన్న అన్ని సరిహద్దులు మూసివేయడంతో ఉన్న ఒకే ఒక్క దారి వాయుమార్గం ఒక్కటే దిక్కుఅయింది. ఒక్కో విమానం వద్ద వందలాది మంది ఉన్నారు. అయితే విమాన ప్రయాణాలను అఫ్గానిస్తాన్ నిషేధించింది. అయితే ఇతర దేశాలకు వెళ్లేందుకు వాయుమార్గాన్ని నిలిపేసింది ఆఫ్గానిస్తాన్ ప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *