ఆ దేశ ప్రధాని అది అమ్ము కున్నాడట..!

ఆ దేశ ప్రధాని అది అమ్ము కున్నాడట..!

ఆ దేశ ప్రధాని అది అమ్ము కున్నాడట..!

పాకిస్తాన్ లో క్రికెటర్లకు ఆరాధ్య దైవ్యం అతడు, రిటైర్మంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఆ దేశ ప్రధాని అయ్యారు. క్రికెట్‌లోనే కాదు, పాలిటికల్ గా మంచి లీడర్‌ని అని నిరూపించుకున్నారు ఆయన. అయితే ఇటీవల ఆదేశ ప్రధాని చేసిన పని..అతడిని నవ్వులపాలు చేస్తోంది.

క్రికెటర్‌, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌.. పాకిస్తాన్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని పాక్ ప్రధానిగా ఎదిగిన లీడర్. పాకిస్థాన్‌లో ఎంతో ఖ్యాతి ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇమ్రాన్ ఖాన్..గిప్ట్ గా ఇచ్చిన గడియారంను అమ్మి..ఆ డబ్బులు నొక్కేశారని ఆ దేశంలో కొన్ని మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా విమర్శలు వచ్చాయి. దీంతో పాక్ లో ప్రతిపక్షాలు ఇమ్రాన్‌ ఖాన్‌పై వ్యంగ్యంగా చెప్పుకుంటున్నారు. అయితే ఇమ్రామన్ ప్రధాని పదవిలో ఉండి.. ఇలాంటి దిక్కు మాలిన పని చేయడం ఏంటని ఏకిపారేస్తున్నాయి.

అయితే.. ప్రస్తుత ప్రధాని.. ఓ గల్ఫ్‌ దేశ యువరాజు ఇచ్చిన ఖరీదైన గడియారాన్ని విక్రయించారని.. దాని అమ్మగా సుమారు రూ.7.4 కోట్లు తన ఖాతాలో వేసుకున్నారని పాక్ లో ప్రచారం బాగా జరుగుతోంది. ఓ ప్రధాని వ్యవహరించిన తీరు సిగ్గుచేటని.. ఇది ప్రధాని పదవిలో ఉండి చేయడం ఏంటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఎవరైనా ఆ ప్రధాని పదవిలో ఉన్నప్పడు ఇతర దేశాలలో పర్యటించినప్పుడు.. ఆ దేశాధినేతలు అధికారికంగా ఇచ్చిన ఖరీదైన బహుమతులను పాక్ లోని గిఫ్ట్ గ్యాలరీలో భద్రపరుస్తారు. ఆ దేశ ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తారు. దేశాధినేతలు ఇచ్చిన గిప్ట్ లను సొంతంగా అమ్ముకునే హక్కు, ఇతరులకు ఇచ్చే హక్కు కానీ ఆ దేశ ప్రధానికి లేదు..ఆ దేశ రాజ్యంగంలోని నిబంధనల ప్రకారం వాటిని బహిరంగ వేలంలో విక్రయిస్తారు. ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు.అయితే దీనికి భిన్నంగా ఇమ్రాన్‌ ఖాన్‌ కక్కుర్తి పడి..ఈ బహుమతులను అమ్ముకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

ఇప్పటికే విదేశీ అప్పులు కలిగిన టాప్ 10 దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరిందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. పాక్ ఆర్థిక పరిస్థితి బాగొలేక గవర్నర్ ఉండే భవనాన్నే అద్దెకు ఇచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ దేశ ప్రధాని చేసిన తప్పుడు పనికి.. నెటిజన్లు, సామన్లు, ప్రతిపక్షాలతో సహా ప్రధానిని ఆడిపోసుకుంటున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఖజానాకు చిల్లుపెట్టే పనుల్ని ఇమ్రాన్‌ ఖాన్‌ చేయడంపై దుమారం రేగుతోంది. అగ్రదేశాలలో ఆ దేశ పరువు అంతంతమాత్రంనే ఉంది. అయితే ఈ పాడుపని చేయడంతో పాకిస్తాన్‌ పరువును ప్రధాని పూర్తిగా తీసేస్తున్నాడని సోషల్‌ మీడియాలో తెగ జోకులు వేసుకుంటూ..తమ కిష్టమొచ్చిన సింబల్స్ తో అభిప్రాయాలను వెళ్లబుచ్చుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *