ఇంట్లో ఈ మొక్క ఏ దిశలో ఉంచాలి.. ఉంటే ప్రమాదమేంటి..?

ఇంట్లో ఈ మొక్క ఏ దిశలో ఉంచాలి.. ఉంటే ప్రమాదమేంటి..?

ఇంట్లో ఈ మొక్క ఏ దిశలో ఉంచాలి.. ఉంటే ప్రమాదమేంటి..?

ప్రస్తుత ట్రెండ్ లో మనీ ప్లాంట్ (money plants) మొక్కను పెంచడం అందరికీ ఓ ఫ్యాషన్ అయిపోయింది. దీనిని పెంచితే అందరూ మనకేదో డబ్బులు కలిసి వస్తాయోనో.. లేక ఇంకేదో వస్తుందనో పెంచుతుంటారు. కానీ ఆ మనీ ప్లాంట్ (ఫోథోస్) మొక్క గురించి నమ్మలేని నిజాలున్నాయండి మరీ తెలుసుకుందామా మరీ..

మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే కలిస్తోందనో చాలామంది నమ్ముతారు. దీనిపై పరిశోధనలు చాలా జరిగాయి. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలుండవని, సిరి సంపదలు, వాస్తుదోషాలు తొలిగిపోతాయని, అదృష్టాన్ని ఇస్తుందనే కొందరి భావన, అయితే మనీ ప్లాంట్ మొక్కను మన గృహాలలో ఎక్కడబడితే అక్కడ ఉంచరాదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

అయితే ఈ మనీ ప్లాంట్ మొక్కను పొరపాటున కూడా తూర్పు ఈస్యాన్యంలో కానీ, ఉత్తర ఈసాన్యంలోకానీ పెంచకూడదట.. మనీ ప్లాంటును ఈ దిశలో పెంచితే అసుభాలు(కీడు) కలుగుతుందట. దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అట. ఉన్నదంతా ఊడ్చిపెట్టుకోవడమే కాకుండా.. ఇంట్లో ఉన్న వాళ్లు కూడా అనారోగ్యాల బారిన పడే అవకాశం లేకపోలేదట…అయితే మనీ ప్లాంట్ మొక్కను తూర్పు ఆగ్నేయ దిశలో పెంచడం వల్ల.. ఆ దిశలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అందుకే ఈ దిశలో మాత్రమే మనీ ప్లాంట్ ను పెంచాలని.. వాస్తు శాస్త్రంలో ఈ ఆగ్నేయ స్థానానికి విఘ్నేశ్వరుని స్థానంగా కొలవబడుతుంది. విఘ్నాలకు అధిపతి వినాయకుడు.. కావున దీని వల్ల సత్ఫలితాలు మాత్రమే వస్తాయని చెప్పబడింది.

అయితే మనీ ప్లాంట్ మొక్కలు ఇంట్లో పెంచుకుంటే అందంగా కనిపించడం జరుగుతుంది. ఈ మొక్క తీగ జాతికి చెందినది. దీనికి సూర్యరశ్మి లేకపోయినా పెరుగుతుంది. చిన్న బాటిల్ లో కానీ, గ్లాస్ లో కానీ, తోట్లలో మట్టి పోసి పాతిపెట్టినా పెరుగుతుంది. ఇండ్లలో కుండీలో లేదా సీసాలో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ మొక్కను పెంచితే మంచిదట. మనీ ప్లాంట్ కు రోజూ నీరు పోస్తూ ఉంటే పరిసర ప్రాంతాల్లో అనుకూలమైన శక్తి వస్తుందట. ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన పత్రాలను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేకపోతే వాస్తు దోషం పడుతుందని వాస్తు రీత్యా మంచిది కాదని అంటున్నారు. శ్రద్ధతో పెంచితే చూపురులకు కూడా ఎంతో కనువిందు చేస్తుంది.

సాధారణంగా ఈ మొక్కలను ఎక్కువగా నగర ప్రజలు పెంచుతుంటారు. ఆఫీసుల్లోనూ కనిపిస్తుంటాయి. అయితే ఈ మనీ ప్లాంట్​ రోగాలూ తెచ్చిపెడుతుందట. ఈ మొక్క ఉన్న చోటికి డెంగీ దోమలు(mosquitos) వస్తాయంట. ఇటీవల నమోదైన డెంగీ కేసుల్లో ఎక్కువగా నగరంలోని సంపన్నులు నివసించే ప్రాంతాల నుంచే వచ్చినట్లుగా వైద్యులు చెప్పారు. దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.. సో జాగ్రత మరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *