ఉత్తరాఖండ్‌ వర్షాలు: నైటిటాల్‌తో సంబంధాలు కట్‌

ఉత్తరాఖండ్‌ వర్షాలు: నైటిటాల్‌తో సంబంధాలు కట్‌

ఉత్తరాఖండ్: గత రెండు రోజులుగా భారీ వర్షాలు, వరదలతో ముంచెతున్నాయి. అయితే ఈ వరద బీభత్సానికి ఇప్పటివరకు 30మంది పైగా ప్రాణాలు కోల్పోయారని అధికారుల సమాచారం. నైనిటాల్‌ సహా ఇతర ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా చోట్ల రోడ్లు, వంతెనలు, ఇళ్లు కొట్టుకుని పోయాయి. రోడ్లు, రహదారులు, రైల్వే పట్టాలు, వీధుల్లోకి వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ పర్యాటక ప్రదేశం. అక్కడి సుందర ప్రదేశాన్ని చూసేందుకు వేలాదిగా టూరిస్టులు వస్తుంటారు. ఈ వర్ష బీభత్సంతో నైటిటాల్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ ప్రదేశంలోని కొండచరియలు విరిగి పడుతుండటంతో ఈ మార్గాలు మూసుకుపోయాయి. నైనీ సరస్సు పొంగిపొర్లుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో హాల్ఛల్ చేస్తున్నాయి. ఈ నైనిటాల్ జిల్లాలోని రామ్‌గఢ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయాని వార్తలు రావడంతో టూరిస్టులు శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చని నైనిటాల్ SSP ప్రియదర్శిని మీడియాకు తెలిపారు.

ఉత్తరాఖండ్ దగ్గరలోని రాంనగర్-రాణిఖేట్ మార్గంలో లెమన్ ట్రీ రిస్టార్ట్ ఉంది. ఇది చాలా సుందరమైన ప్రదేశం. అక్కడకి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు పడటంతో కోసి నది నుంచి వరద పోటెత్తడంతో లెమన్ ట్రీ రిస్టార్ట్ లో సుమారు 200 మంది చిక్కుకున్నామని.. సోషల్ మీడియా వేదికగా మమ్మల్ని రక్షించండని పోస్టులు పెట్టడంతో దీనిపై స్పందించిన పోలీసులు.. వెంటనే వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు నది పరివాహాక ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితులను సైనిక హైలికాప్టర్ల సాయంతో తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, మరో రెండ్రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *