ఏపీలో మాస్క్ లేకుంటే 10 వేల నుంచి 25వేల వరకు జరిమానా

ఏపీలో మాస్క్ లేకుంటే 10 వేల నుంచి 25వేల వరకు జరిమానా
ఆగస్టు 14 వరకు కర్ఫ్యూ ఆంక్షలు తప్పవంటున్న ఏపీ సర్కార్
దేశంలో గత కొద్దిరోజుల్లో అనుహ్యంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీనిలో భాగంగానే నిబంధల్ని మరింత కఠినం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా తిరిగే వారికి భారీ జరిమానాలు విధించాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం. ఆఫీసులు, షాషింగ్ మాల్స్ లో మాస్క్ లు లేకుండా తిరిగే ప్రతి ఒక్కరికి రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ హెచ్చరించింది. కోవిడ్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా 8010968295 వాట్సాప్ నెంబర్ కేటాయించిన ఆరోగ్యశాఖ. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్క్ లేకుండా తిరుగుతుంటే అట్టి ఫోటోలను పంపినట్లయితే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు అధికారులు.