ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 3.1% డీఏ పెంపు
పెరిగిన డీఏ జూలై నుంచి అమలు, 2019 జనవరి నుంచి అమలు..
హైదరాబాద్ నుంచి వచ్చిన ఏపీ ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ కొనసాగింపు
ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల కరువు భత్యంపై ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. 2019 జనవరి నుంచి 2021 జూన్ వరకు ఉన్న డీఏ బకాయిలను పెన్షనర్లకు, సీపీఎస్ ఉద్యోగులకు మూడు విడతల్లో వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. పెరిగిన(డీఏ) 3.144 శాతం ఉద్యోగుల డీఏ వారి బేసిక్ జీతంలో 30.392 శాతం నుంచి 33.536 శాతానికి చేరుకుంది.ఈ పెరిగిన డీఏను 2019 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. పెరిగిన డీఏతోనే జూలై నెల జీతాలు, పెన్షన్లు ఇస్తామని ఆర్థిక శాఖ వెల్లడించింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) ఉన్న ఉద్యోగులకు బకాయిలను మూడు విడతలుగా వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివచ్చిన ఉద్యోగులకు ఇస్తున్న 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్(హెచ్ఆర్ఏ)ను మరో ఏడాది కొనసాగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.