ఓల్డ్ వర్షన్ కలిగిన స్మార్ట్ ఫోన్లలో జీమెయిల్, యూట్యూబ్ పని చేయవు: GOOGLE

- ఓల్డ్ వర్షన్ కలిగిన స్మార్ట్ ఫోన్లలో జీమెయిల్, యూట్యూబ్ పని చేయవు: GOOGLE
- ఓల్డ్ వర్షన్ కలిగిన ఫోన్ ప్రియులకు గూగుల్ షాకింగ్ న్యూస్.
- సాఫ్ట్ వేర్ అపుడేట్ చేసుకోకపోతే ఫోన్లు పనిచేయవన్న గూగుల్
పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వర్షన్‌ను కలిగివున్న ఆండ్రాయిడ్ ఫోన్లకు గూగుల్ అకౌంట్లలోకి సైన్ఇన్ అవ్వకుండా మద్దతు వెనక్కి తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. అయితే ఓల్డ్ జనరేషన్ వాడుతున్న 7.2.3 వర్షన్‌తో పాటు అంతకన్నా తక్కువగా నడుస్తోన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇకపై సైన్ ఇన్లకు సపోర్టును నిలిపేస్తామని తెలిలపిన గూగుల్. ఈ నిర్ణయాన్ని 2021 సెప్టెంబర్ 27 నుంచి తెచ్చే యోచలో గూగుల్ పరిశీలిస్తోంది.
ఓల్డ్ వర్షన్ ఫోన్లు వాడుతున్నయూజర్లకు గూగుల్ సూచన
ఓల్డ్ వర్షన్ ఫోన్లు వాడుతున్నయూజర్లకు 2.3.7 కంటే తక్కువ వర్షన్ వాడుతున్న యూజర్లకు గూగుల్ ఈ-మెయిల్‌ను ద్వారా సందేశాలు పంపింది. తక్కువ వర్షన్ వాడుతున్నయూజర్లు కనీసం ఆండ్రాయిడ్ 3.0 హనీకోంబ్ వోఎస్‌కు తమ స్మార్ట్ఫోన్లను ఆప్డేట్ చేసుకోవాలని గూగుల్ సూచించింది.
ఒక వేళ అప్డేట్ చేయకపోతే జీమెయిల్, గూగుల్ సెర్చ్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్, ఇతర గూగుల్ సేవలను యాప్‌ల ద్వారా పొందలేరని ఈ-మెయిల్‌ను యూజర్లకు తెలిసిన గూగుల్. యూజర్లు వీటిని చూడాలంటే ఫోన్ బ్రౌజర్లో మాత్రమే చూడగలగే అవకాశం ఉందన్న గూగుల్ సంస్థ. ప్రస్తుతం కాలంలో ఆండ్రాయిడ్ 3.0 వర్షన్ దాని కంటే తక్కువ కలిగిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వర్షన్ అతి తక్కువమంది యూజర్లు వాడుతున్నారని గూగుల్ సంస్థ తెలిపింది.
ముఖ్యంగా యూజర్ల భద్రత, డేటాను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. 2021 సెప్టెంబర్ 27 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 7.3.2 ఉన్న స్మార్ట్ఫోన్లలో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తే యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఏర్రర్ వస్తుందని తెలిపిన గూగుల్.
ఫోన్లు అన్న మార్చుకోండి లేదా మీ యూజర్ల సాఫ్ట్ వేర్ ని అప్డేట్ చేయమని తెలిపిన గూగుల్. సో గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ఓల్డ్ వర్షన్ ఆండ్రాయిడ్ కలిగివున్న స్మార్ట్ఫోన్లు కలిగియున్న ఫోన్ ప్రియులకు మాత్రం కొన్ని కష్టాలు తప్పవు మరి. ఓల్డ్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోదారులు గమినించుకోగలరని సూచించిన గూగుల్.