కరాచీలో మహిమగల ఆంజనేయ స్వామి ఆలయం

కరాచీలో మహిమగల ఆంజనేయ స్వామి ఆలయం

కరాచీలో మహిమగల ఆంజనేయ స్వామి ఆలయం

ఒకప్పుడు భారత్ లోనే అంతర్భాగమైన పాకిస్తాన్.. అప్పుడు మన దేశం నుంచి విడిపోయిన తరువాత ముస్లింల పాలన కొనసాగుతోంది. 1947 లో ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలసిన ప్రముఖమైన క్షేత్రం పాకిస్థాన్‌లోని కరాచీలో ఉంది. ఇక్కడి శ్రీ పంచముఖి హనుమాన్‌ మందిరం యుగయుగాల నుంచి పూజలందుకుంటోంది. విగ్రహం హనుమ, నరసింహ, ఆదివరాహ, హయగ్రీవ, గరుడ ముఖాలతో దర్శనమిస్తుంది.  1947 లో ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయాక అక్కడ నివసించే హిందువులు వేలాదిగా ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే అక్కడి స్థల పురాణం ప్రకారం వనవాసంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్షణుడితో కలిసి  విడిది చేసినట్టు స్థానిక స్థలపురాణం చెబుతోంది. పాక్‌లో ఉన్న హిందువులంతా ప్రతి ఏటా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. పురావస్తుశాఖ అధ్యయనంలో ఈ శ్రీ పంచముఖి హనుమాన్‌ మందిరం 1500ఏళ్ల క్రితం నిర్మించినట్టు చెబుతున్నారు. అయితే ఇక్కడి మందిరం స్వయంభువుగా వెలసిందని పురువాస్తు శాఖ చెబుతోంది. కరాచీలో ఉన్న పంచముఖి ఆంజనేయుని ఆలయంలో ఉన్న విగ్రహం 8 అడుగుల ఎత్తు ఉంటుందని పురావస్తు శాఖ వెల్లడించింది. ఈ ఆలయంలో స్వామివారి చుట్టూ 21 ప్రదక్షిణాలు చేస్తే చాలు అనుకున్న కోరికలు నెరవేరుతాయట. ఈ ఆలయాన్ని హిందువులే కాదు కొంతమంది ముస్లింలు కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారట. ఇటీవలే జరిపిన తవ్వకాల్లో కొన్ని పురాతనమైన విగ్రహాలు బయటపడ్డాయిని పురావస్తు శాఖ చెబుతోంది. అయితే ఈ విగ్రహాలన్నీ ఆ ఆలయంలో ప్రతిష్టించారని చరిత్రకారులు చెబుతున్నారు. పాకిస్తాన్ లో ఎన్ని గొడవలన్నప్పటికీ ముస్లింలతో సహా ఎవరూ కూడా ఈ ఆలయ విషయంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. మన ఎంతటి ఆలయంలో ఆంజనేయునికి ఎంత పట్టు ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *