కరోనా సర్టిఫికెట్ వాట్సాప్ లో కూడా

కరోనా సర్టిఫికెట్ వాట్సాప్ లో కూడా
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా మారింది. కరోనా టీకా తీసుకున్నట్లు కరోనా సర్టిఫికెట్ సమర్పించిన వారికే ప్రయాణ అనుమతి లభిస్తోంది.
దీనిలో భాగంగానే ఇకపై కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందే అవకాశం.. వ్యాట్సాప్ ద్వారా సర్టిఫికెట్ పొందేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారుడుకి మరింత దగ్గరయ్యేందుకు మెసులుబాటు కలిగించింది.
ఇకపై వాట్సాప్ ద్వారా సెకండ్ల వ్యవధిలోనే ఈ కరోనా సర్టిఫికెట్ పొందవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం కోవిడ్ పోర్టల్ ద్వారా ఈ సర్టిఫికెట్ పొందే సదుపాయం ఉంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ పోర్టల్ సరిగా పనిచేయడం లేదని వ్యాక్సినేషన్ తీసుకున్న వినియోగదారుల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయి.
అయితే ప్రస్తుతం కోవిడ్ టీకా ఒక్క డోసు తీసుకున్నా, రెండో డోసు తీసుకున్నా.. వాట్సాప్ నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినందుకు పార్టీలకు అతీతంగా నేతలు, వాట్సాప్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉందని, వేగంగా పని చేస్తోందని ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం శశి థరూర్ ఎంపీ ట్వీట్ చేశారు.
వాట్సాప్ నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ ఇలా..
ముందుగా 90131 51515ను నెంబర్ ను మీ ఫోన్ సేవ్ చేసుకోండి.
MyGov Corona Helpdesk వాట్సాప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డోన్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో సర్టిఫికెట్ పొందడం కోసం ఈ పద్దతులను ఫాలో అవ్వండి.
చాట్ విండో ఓపెన్ చేసి డౌన్ లోడ్ సర్టిఫికెట్ అని సందేశం పంపిచాల్సి ఉంటుంది.
రిజిర్ట్రు చేసుకున్న నెంబర్ కు ఆరెంకెల ఓటీపీ వస్తుంది. వ్యక్తి పేరును ధ్రువీకరించిన తర్వాత కొన్ని క్షణాల్లోనే వ్యాక్సిన్ సర్టిఫికెట్ మీ ఫోన్ లో ప్రత్యక్షమవుతుంది.
ఒక వేళ వ్యాక్సిన్ కోసం వేరే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటే.. ఆ ఫోన్ నుంచే ఈ మెస్సేజ్ పంపిచాల్సి ఉంటుంది.
వ్యాక్సిన్ సర్టిఫికెట్ తో పాటు కరోనాకు సంబంధించిన సలహాలు, అపోహలు, నిపుణుల సూచనలు, సమాధానాలు వంటివి ఈ హెల్ప్ డెస్క్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.
సర్టిఫికెట్ పొందేందుకు పై నెంబర్ కు Hi అని పంపితే మోనూ వస్తుంది.
సో.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందేందుకు ఓ సారి ట్రై చేస్తే పోయేదేముంది..