ఈ జ్యూస్ తాగారంటే మీ ఆరోగ్యం గ్యారంటీ !

ఈ జ్యూస్ తాగారంటే మీ ఆరోగ్యం గ్యారంటీ !

” కాకరకాయ జ్యూస్..ఆరోగ్యానికి ఎంతో మేలు” 

మనం నిత్యం తినే కూరగాయల్లో కాకరాయ ఒకటి. కాకరకాయతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.  కాకర ఏం మేలు చేస్తుందో చూద్దామమరి.

కాకర జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకుంటే షుగర్ కు చెక్ పెట్టొచ్చు. కాకరలో ఎన్నో రకాల విటమిన్స్  ఉన్నాయి. కాకరలో విటమిన్లు సి, బి, ఏ బీటా కెరోటిన్లు ఉన్నాయి. వీటితో పాటు మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, జింక్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఆస్తమాతో బాధపడే వారికి కాకర ఎంతో మేలు చేస్తోంది.

 ఇంజెక్షన్లు, టాబ్లెట్లతో హిమోగ్లోబిన్ పెంచుకునేకంటే కూరగాలతో శరానికి విటమిన్లు అందించుకోవచ్చు అని న్యూట్రిషన్లు అంటున్నారు. పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అని పెద్దల సామెత ఉంది. అట్లానే చేదుగా ఉండే వాటిని ట్రై చేస్తే నాలుకకి మాత్రమే కాకుండా న్యూరో మెకానిజంపై వెంటనే ప్రభావం పడుతుంది. అయితే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్  మారుతుంటాయని న్యూట్రీషిన్లు చెబుతున్నారు.

    కాకరవల్ల ఉపయోగాలు: కాకరతో  క్యాన్సర్ కూడా చెక్ పెట్టొచ్చు.  క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తోంది కాకర. బరువు తగ్గాలనుకునే వారందరూ కాకర తీసుకొంటే మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల  జీర్ణక్రీయ వేగంగా జరిగి అరుగుదలను సమవృద్ధిగా ఉంటుంది.

కాకరతో మలమద్ధకానికి చెక్ పెట్టొచ్చు:  కాకరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తేలికగా అరిగిపోతుంది. కాకర అజీర్తి సమస్యలకు ఎంతో మేలు చేస్తుంది.

 మధుమేహం:  షుగర్ తో బాధపడే వాళ్లు కాకరను నిత్యం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు పొందొచ్చు. కాకరలో బ్లడ్ షుగర్ తగ్గించడానికి ఉపయోగపడే ఇన్సులిన్ వంటి రసాయనాలున్నాయి. దీనితో  డయబెటిస్ కు చెక్కు పెట్టొచ్చని అంటున్నారు న్యూట్రీషిన్లు.

 కాకరకాయ జ్యూస్ తయారీ విధానం:  కాకర కాయ, రెండు ఉసిరి కాయలు,  అల్లం ముక్క, గ్లాసు వాటర్, నిమ్మకాయలు, సాల్ట్ తీసుకోవాలి.

   ముందుగా  కాకరను ముక్కలు చేసుకోవాలి, ముక్కలు చేసుకున్న నిమ్మకాయలు, ఉసిరి, అల్లం తో పాటు సాల్ట్ వేసి మిక్సిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని వడకట్టి ఓ గ్లాసులోకి తీసుకోవాలి. ఇలా డైలీ చేయడం వల్ల మల బద్ధకంతో పాటు, డయాబెటీస్ అదుపులోకి వస్తుంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *