కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్ ప్రాజెక్టులోని నీటివిడుదల

కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్ ప్రాజెక్టులోని నీటివిడుదల
రెండు, మూడు మోటర్లతో నీటి తరలింపు
10 TMCల నీరు నింపాలని నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అధ్భుత ఘట్టం చోటు చేసుకుంది. మల్లన్నసాగర్‌లోకి నీటి తరలింపు ట్రయల్ విజయవంతమైంది. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ పంప్ హౌస్ లో అధికారులు మోటార్లు ఆన్ చేసి నీటిని వదిలారు. పంప్ హౌస్ లో నీటిని ఎత్తిపోసే దానిలో భాగంగా 8 మోటార్లను ఏర్పాటు చేశారు. అయితే రెండు, మూడు మోటార్లతో ఆన్ చేసి మల్లన్న సాగర్ లోకి నీటిని ఎత్తి పోసారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 5 రిజర్వాయర్ల ద్వారా మల్లన్న సాగర్ కు నీటిని ఎత్తిపోశారు. ఈ నెల 10 టీఎంసీలు నీరు తరలించాలని అధికారులు నిర్ణయించారు. అయితే మల్లన్నసాగర్‌లోకి కాళేశ్వర జలాలు చేరడంతో సీఎం కేసీఆర్ స్వప్నం సాకారమైందని మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికకగా పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నీటితో కళకళలాడుతోంది. ఈ ప్రాజెక్టులోకి మొదటి విడతగా 10 టీఎంసీల గోదావరి జలాలు ఈరోజు విడుదలయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. pic.twitter.com/8ht5R37zVU
— Harish Rao Thanneeru (@trsharish) August 22, 2021
కేసీఆర్ స్వప్న సాక్షాత్కారం, తెలంగాణకు అమృత జలాభిషేకం. సాకారమైన మల్లన్న సాగరం. అనుమానాలు అపశకునాలు అవరోధాలు తలవంచి తప్పుకున్నయి. కుట్రలు కుహనా కేసులు వందల విమర్శలు వరద నీటిలో కొట్టుక పొయినయి. గోదారి గంగమ్మ మల్లన్న సాగరాన్ని ముద్దాడింది. కరువును శాశ్వతంగా సాగనంపింది. pic.twitter.com/vNA5Ru9CPq
— Harish Rao Thanneeru (@trsharish) August 22, 2021