కొత్తగా శామ్సంగ్ గెలాక్సీ మడతపెట్టే స్మార్ట్ ఫోన్లు

కొత్తగా శామ్సంగ్ గెలాక్సీ మడతపెట్టే స్మార్ట్ ఫోన్లు
సెప్టెంబరు 10 నుంచి దేశీయ మార్కెట్ లో లభ్యం
అధ్బుతమైన ఫ్యూచర్లు తయారీ చేయండంలో సౌత్ కొరియాకు చెందిన శామ్సంగ్ కంపెనీ ఒకటి. అయితే సెల్ ఫోన్లు వాడే ప్రియుల కోసం శామ్ సంగ్ కొత్తగా ఆలోచన చేసింది. అయితే అదిరిపోయే ఫీచర్లతో ఇండియాలో సెల్ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మడత (ఫోల్డబుల్) ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. అయితే సెప్టెంబర్ 10 నుంచి ఇండియాలో అందుబాటులోకి తెస్తామని శామ్ సంగ్ తెలిపింది.
దీని సందర్భంగా 5జీ టెక్సాలజీతో ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్-3 5జీ, గెలాక్సీ జడ్ ఫ్లిప్-3 5జీ స్మార్ట్ఫోన్లు ఫోల్డ్ ఫోన్లను విడుదల చేసింది. ఇవి దేశ వ్యాప్తంగా అన్ని స్టోర్లలో లభ్యమవుతాయని శామ్ సంగ్.కామ్ వెబ్ సైట్ సహా ప్రముఖ రిటైల్ షాపుల్లో అమ్మకాలు ప్రారంభమవుతాయని తెలిపింది. అయితే వీటి ప్రారంభ ధర రూ.84,999 నుంచి ప్రారంభం. ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 9 వరకు ముందస్తు బుకింగ్లు చేసుకోవచ్చు. శామ్సంగ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
అయితే గెలాక్సీ ఫోల్డ్3 5జీ రెండు రకాల మోడల్స్ ను విడుదల చేసింది.
12జీబీ ర్యామ్, 256జీబీ మెమొరీ- రూ.1,49,999
12జీబీ ర్యామ్, 512జీబీ మెమొరీ- రూ.1,57,999
గెలాక్సీ ఫ్లిప్ 3 5జీ కూడా రెండు రకాల మోడల్స్ ను విడుదల చేసింది.
8 జీబీ ర్యామ్, 128జీబీ మెమొరీ- రూ.84,999
8 జీబీ ర్యామ్, 256జీబీ మెమొరీ- రూ.88,999
ఈ ఫోన్లను విక్రయించే వారు హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్లను కొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు.