టోక్యో ఒలింపిక్ లో పోరాడి గెలిచిన కాంస్యం: పీవీ సింధు

టోక్యో ఒలింపిక్ లో పోరాడి గెలిచిన కాంస్యం: పీవీ సింధు
టోక్యో: మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో చైనా క్రీడాకారిణి బింగ్ జియావో పై పీవీ సింధు తన ప్రతిభను కనబర్చింది. మూడో స్థానం కోసం పీవీ సింధు చైనా క్రీడాకారిణిపై పోరాడి గెలిచింది. ఇండియాకు మరో పతాకాన్ని అందించింది. ఇండియా జాతీయ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించిన మరో మహిళ పీవీ సింధు, 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోపై గెలిచింది.
తాజాగా గెలిచిన కాంస్యంతో ఒలింపిక్ లో రెండు పతకాలు సాధించిన పీవీ సింధు. 2016 రియోలో జరిగిన ఒలింపిక్ లో సింధు రజతం సాధించింది. స్వర్ణ పతాకంపై పెట్టుకున్న ఆశ నెరవేరలేదన్న బాధే తప్ప పీవీ సింధుపై భారతావని పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయలేదని చెప్పకనే చెప్పొచ్చు.
టోక్యో ఒలింపిక్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధుకు తెలుగు సూపర్ స్టార్ మహేశ్‌బాబు అభినందనలు తెలిపాడు. పీవీ సింధు గెలుపు దేశానికే గర్వకారణమని, ఇండియా గర్వించ దగ్గ విషయమని పీవీ సింధూని కొనియాడారు. ఒలింపిక్ లో ఇండియా మరో చారిత్రాత్మక విజయం సాధించిందన్న మహేష్ బాబు, కాంస్యం గెలిచిన బ్యాడ్మింటన్ పీవీ సింధుకు నా అభినందనలు అంటూ అని స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.