“ తగ్గేదే లేదంటున్న స్టైలిష్ స్టార్ పుష్ప” పార్టు-1

“ తగ్గేదే లేదంటున్న స్టైలిష్ స్టార్ పుష్ప” పార్టు-1

“ తగ్గేదే లేదంటున్న స్టైలిష్ స్టార్ పుష్ప” పార్టు-1

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు వస్తుందా అభిమానులు ఎదురు చూస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా అంటే ఎదైనా స్పెషల్ ఉండాల్సిందే. అయితే ఈసారి కొత్త గేటెప్ తో పుష్ప చిత్రంలో అర్జున్ నటింబోతున్నాడు. రెండు పార్టులుగా సుకుమార్ తీయబోతున్నారు. ఈ సినిమాను శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథే పుష్ప చిత్రం. పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ సందడి చేయనున్నారు. పుష్ప టీచర్ కూడా రిలీజ్ అయంది.

తొలి సాంగ్ రిలీజ్ ఆగష్టు 13న

ఆగష్టు 13న తొలి సాంగ్ విడుదల చేయనున్నారు.  తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హీందీలోని పాటని ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ‘దాక్కో దాక్కో మేక…పులొచ్చి కొరుకుద్ది పీక…’ అనే పాటను గాయకులు తెలుగులో శివమ్‌, హిందీలో విశాల్ దద్ లానీ, కన్నడంలో విజయ్ ప్రకాష్, మలయాళంలో రాహుల్ నంబీయా, తమిళ్ లో బెన్నీ దాయల్ ఆలపించారు.

కాంబినేషన్ అదుర్స్ :

అల్లు అర్జున్ తో పదేళ్ల తర్వాత సుకుమార్‌ కాంబినేషన్ లో ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

హీరో అల్లు అర్జున్‌, డైరక్టర్ సుకుమార్‌, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ కలయికలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య2’ పాటలు అభిమానుల గుండెల్లో హత్తుకుపోయాయి. అదే కాంబినేషన్ లో పదేళ్ల తరువాత వస్తున్న సినిమానే ‘పుష్ప’. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *