తారక్.. లంబోర్ఘిని ఊరుస్‌ కారు ఎంతో తెలుసా..

తారక్.. లంబోర్ఘిని ఊరుస్‌ కారు ఎంతో తెలుసా..

తారక్.. లంబోర్ఘిని ఊరుస్‌ కారు ఎంతో తెలుసా..

దేశంలోనే తొలి లంబోర్ఘిని ఊరుస్‌ కారు కొన్న సెలబ్రెటీ

కొత్త కారు కొన్న వ్యక్తిగా రికార్డు

దీని ఖరీదు రూ.3.16 కోట్లు

మార్కెట్లోకి ఏ కొత్త కార్లు వచ్చినా సినీ సెలబ్రెటీలు కొనాలని చూస్తారు. అయితే ఖరీదైన కార్లు కొంటమంటే సెలబ్రెటీలకు ఎంతో మక్కువ. ఇండస్ట్రీలో ఓ స్టేటస్ కోసం సెలబ్రెటీలకు కార్లు కొంటుంటారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు బీఎండబ్ల్యూ, రేంజ్‌రోవర్‌, మెర్సిడేస్‌, ఆడి, రోల్స్ రాయల్స్ వంటీ కార్లను తమకు నచ్చిన రేంజ్ లో వారి హోదాకు తగ్గట్టుగా గ్యారేజ్‌లో చేర్చుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖరీదైన లగ్జరీ కారు.. లంబోర్ఘిని ఉరుస్ కారును కొనుగోలు చేసి తెలుగు ఇండస్ట్రీలోనూ..మరియు దేశంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు.

ఇండియాలో తొలి రోజే లాంచ్‌ లంబోర్ఘినీ ఊరుస్‌ కారును ఎన్టీఆర్‌ బుక్‌ చేసుకున్నాడు. దీనికి రూ.3.16 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అనంతరం ఇటలీ నుంచి ఫ్లైట్ లో శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఆ తర్వాత కారును తారక్‌ ఇంటికి చేర్చారు కంపెనీ యాజమాన్యం. ప్రస్తుతం దీని ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటలీకి చెందిన వోక్స్‌ వాగన్‌ కంపెనీ అనుబంధ సంస్థయే ‘లంబోర్ఘిని’. ప్రపంచ వ్యాప్తంగా కార్లను తయారు చేసింది. అయితే  గతేడాది ఈ కార్లను ఉత్పత్తి చేసింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉండటంతో దీని రేటింగ్ కూడా ఉండటంతో ఎన్టీఆర్ మనసు దానిపై మళ్లింది. అయితే ఈ కారును ఇండియాలో సోమవారం రోజున దీనిని అధికారింగా లాంచ్‌ చేశారు కంపెనీ ప్రతినిధులు

లంబోర్ఘిని ఊరుస్‌ కారు ప్రత్యేకతలు:

ఈ కారు బుల్లెట్ ఫ్రూవ్ తో ఈ కారు తయారు చేయబడింది. దీని ఖరీదు రూ.3.16 కోట్ల రూపాయిలు, ఈ కారు ఫుల్ ఆటోమేటేడ్‌. 200 కిమీ వేగంతో వెళుతున్నా..కారులో ఎలాంటి కుదుపులు ఉండవు అని..   2 నిమిషాల్లో 200 స్పీడుకు వెళ్లి.. మళ్లీ 1 నిమిషంలో 10 కి.మీ తగ్గించినా ఎలాంటి ఒడిదుడుకులు లోను కాదట. అయితే ఈ కారులో గొప్పతనమేమిటంటే ఆటో సెన్సర్ మిషన్స్ కూడా ఉంది.. సో ఎదురుగా వాహనాలుంటే అలర్ట్ చేస్తుంది. దీనో మరో విశేషమేమిటంటే ఆటోమేటేడ్‌గా కారు లాక్ అవుతుంది. ఈ కారులో ఓ ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి ప్రమాదం జరిగిన కారు అద్దాలు కానీ, డోర్‌లు కానీ అంత ఈజీగా తెరచుకోవట. దీంతో కారులో ప్రయాణించే వారికి ఫుల్ సేఫ్టీగా భావించొచ్చు. ఈ కారు మొత్తం ఫుల్లీ ఆటోమెటెడ్‌, సెఫ్టీతో లంబోర్ఘినిని తయారు చేశారు. అందుకే దీనిమీద ప్రపంచ వ్యాప్తంగా మోజు అని చెప్పొచ్చు. సో దేశవ్యాప్తంగా ఎన్టీఆర్‌ లంబోర్ఘీన ఊరుస్‌ కారు కొనడంపై ఇప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇంకో విషయమేమిటంటే ఇప్పటికే ఎన్టీఆర్‌ గ్యారేజ్‌ లో 20పైగా కార్లు ఉన్నాయట. అయితే సెలబ్రెటీలు కార్లు కొనడంవల్ల సంఘంలో ఓదా అనేది ఉంటుందట. అందుకే కొత్త కార్ల కోసం ప్రతి ఒక్కరు పోటీపడుతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: