తిరుమల వెంకన్న లడ్డూకు 306 ఏళ్లు.. పుట్టిన రోజు అంటూ ప్రచారం

తిరుమల లడ్డూ వెస్టివల్ అంటూ వైరల్ చేసిన వెంకన్న భక్తులు
తిరుమల తిరుపతి శ్రీ వెంకన్న స్వామికి నైవేద్యంగా నివేదించి భక్తులకు పంచిపెట్టే లడ్డు, వడ తినే పదార్ధాలన్నీ ప్రసాదంగా పిలవబడుతుంది. ప్రసాదం అన్న పర్యాయ పదం అనే స్థాయిని లడ్డు సంపాదించుకుంది. తిరుపతి లడ్డూ తిరుమలలో శ్రీవారి ప్రసాదాల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. తిరుమల ప్రసాదం అంటే లడ్డూ అనే గుర్తుకు వచ్చేలా పేరు తెచ్చుకుంది.
కలియుగదైవంగా శ్రీవారు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. శ్రీవారి ఆలయం నిత్యకల్యాణం పచ్చతోరణం. రోజుకో ఉత్సవంలో భక్తుల రద్దీతో కలకాలాడుతూ ఉంటుంది. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర్వస్వామి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు లడ్డూని పరమ ప్రసాదంగా భావిస్తారు. అందుకే భక్తులు ఎవరైనా తిరుమలకు వెళ్తే ఇంకా స్వామి లడ్డూలు దొరికితే బాగుండు అని కోరుకుంటారు. ఇవి తినేందుకు ప్రతి భక్తుడు ప్రసాదం పెడితే బాగుండని అనుకుంటారు. తిరుమలలో లడ్డూల కోసం ఎగబడతారు భక్తులు. అందుకే ఎవరైనా తిరుమల వెళ్లే మాకు ప్రసాదం తే.. అంటూ పదే పదే గుర్తుకు తెస్తుంటారు. తెచ్చిన ప్రసాదాన్ని ఎంతమందికి పంచితే అంత పుణ్యం అని శ్రీవారి భక్తులందరూ అంటుంటారు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం 306వ పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఓ పోస్టును తిరుపతి లడ్డూ తినే భక్తులందరూ లడ్డూ పోస్టును తెగ వైరల్ చేస్తున్నారు.