తెలంగాణలో ఇక కోవిడ్ ఆంక్షలు లేవు

తెలంగాణలో ఇక కోవిడ్ ఆంక్షలు లేవు. థర్డ్ వేవ్ ముప్పు తొలగినట్టేనని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆఫీసులు, స్కూళ్ళు యధావిధిగా తెరుచుకోవచ్చని చెప్పారు. అయితే అంతమాత్రాన కరోనా ముప్పు తొలగినట్టు కాదనీ… కోవిడ్ జాగ్రత్తలు మాత్రం అందరూ పాటించాలని కోరారు. మాస్కులు పెట్టుకుంటూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. వచ్చే కొన్ని నెలల పాటు కొత్త వేరియంట్లు పుట్టకొచ్చే అవకాశాలు తక్కువేనని అంటున్నారు హెల్త్ డైరెక్టర్. ఇక సాధారణ ఫ్లూగానే కరోనా మారుతుందని చెబుతన్నారు. కోవిడ్ మాత్రం ఇంకా దశాబ్దాల పాటు ఉంటుంది. భవిష్యత్తులో అన్ని వేరియంట్లను తట్టుకునేలా వ్యాక్సిన్స్ కూడా వస్తున్నాయన్నారు డీహెచ్ శ్రీనివాస రావు. రాష్ట్రంలో రాబోయే వారం, పది రోజుల్లో వంద లోపే కరోనా కేసులు నమోదవుతాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *