తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

తెలంగాణలో ఇంటర్‌ చదివే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అయితే కరోనాతో ఇంటర్ విద్యార్థులు కాలేజీలకు వెళ్లలేని పరిస్థితి దృష్ట్యా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు అందించినప్పటికీ విద్యార్థులకు 100శాతం సిలబస్ లో కొంత వ్యత్యాసం జరిగింది. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురైయ్యారు.

ఈ పరిణామాల దృష్ట్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇంటర్  సిలబస్ పై నిపుణల కమిటీ 70శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వాలని మంత్రికి వివరించగా..మంత్రి అంగీకరించినట్లు తెలిపారు.

ఇంటర్ పరీక్షలు స్టడీ మెటీరియల్ ను ఇవాళ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..ఇంటర్‌ పరీక్షల్లో ఒత్తిడి, భయం లేకుండా ఉండేందుకే ఈ స్టడీ మెటీరియల్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సారి జరిగే ఇంటర్ పరీక్షల్లో 70 శాతం సిలబస్ నుండే ప్రశ్న లు ఇస్తాయని తెలిపారు.అలాగే 50 శాతం ఛాయిస్ ఉంటుందని.. లక్షలాది మంది విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. అయితే ఈ స్టడీ మెటీరియల్ ను నిష్ణాతులతో తయారు చేయించామని మంత్రి సబితా తెలిపారు. ఈ స్టడీ మోటీరియల్ ఇంటర్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచాలని ఇంటర్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 25వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేవలం 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఇస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *