దేశం విడిచి పారిపోయిన ఆఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ

దేశం విడిచి పారిపోయిన ఆఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ

దేశం విడిచి పారిపోయిన ఆఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ

నాలుగు కార్లలో, హెల్లికాప్టర్ లో..

డబ్బు సంచులతో ఉడాయించిన ఘనీ

హెలికాప్టర్ లో నగదు సరిపోక అక్కడే వదిలేసి పోయాడు: రష్యా

ఆఫ్గానిస్తాన్ ను తాలిబన్లు అక్రమించుకోవడంతో ఆఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ ఆదివారం దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆఫ్గానిస్తాన్ అశ్రఫ్ ఘనీ భారీగా నగదుతో నిండిన నాలుగు కార్లతో హెలికాప్టర్లలో పరారయ్యాడని రష్యన్ ఎంబసీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. హెలికాప్టర్ లో మరింత డబ్బును కుక్కేందుకు ప్రయత్నించారని, అయితే అతను తీసుకెళ్లిన డబ్బు ఆ హెలికాప్టర్ లో పట్టేంత స్థలం లేకపోవడంతో పెద్దమొత్తంలో డబ్బులను వదిలేసి వెళ్లినట్లు అంతర్జాతీయ మీడియా, వార్తా కథనాలొచ్చాయి. తొలుతగా ప్రాణాలు కాపాడుకునేందుకే అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ తొలుత తజకిస్తాన్‌కు పారిపోయినట్లు రిపోర్టులు వచ్చాయి. అలాగే అశ్రఫ్ ఘనీ, భార్య తో పాటుగా చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు పారిపోయారని అల్ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి అశ్రఫ్ ఘనీ ఎక్కడ ఉన్నారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

అశ్రఫ్ ఘనీ పై రష్యన్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఇస్చెంకో తన వ్యాఖ్యలను రాయిటర్స్‌తో ధృవీకరించారు. నాలుగు కార్లలో డబ్బుతో నింపి హెలికాప్టర్ లో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. హెలికాప్టర్ లో డబ్బు సరిపోక కొంత భాగాన్ని అక్కడే పడేసి పారిపోయారని..దీనికి సంబంధించిన సాక్ష్యాలు రష్యన్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఇస్చెంకో ఉన్నాయని పేర్కొన్నారు.

కాబుల్ లో దౌత్య పరమైన ఉనికిని రష్యన్ నిలుపుకుంటుందని, తాలిబన్లతో మంచి సంబంధాలు పెంచుకుంటామని  రష్యా ప్రకటించింది. వారిని దేశపాలకులుగా గుర్తించడం తొందరపాటు కాకపోయి నప్పటికీ, తాలిబన్ల ధోరణిని నిశితంగా గమనిస్తూనే ఉంటామని ప్రకటించడం విశేషం. దీనితో పాటుగా తాలిబన్లతో స్నేహా పూర్వక సంబంధాలను కలిగి ఉంటామని చైనా ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. అయితే ఈ ఇరుదేశాలు తాలిబన్లకు మద్దతు పలుకుతుందనే చెప్పకనే చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *