దేశ వ్యాప్తంగా స్కూళ్లు ఓపెన్, రోజు విడిచి రోజు క్లాసులు..?

దేశ వ్యాప్తంగా స్కూళ్లు ఓపెన్, రోజు విడిచి రోజు క్లాసులు..?

దేశ వ్యాప్తంగా స్కూళ్లు ఓపెన్, రోజు విడిచి రోజు క్లాసులు..?

దేశ వ్యాప్తంగా ఆగస్టు 16 తర్వాత ఓపెన్ చేసే యోచనలో రాష్ట్రాలు

విద్యాశాఖకు కొన్నిరాష్టాల ప్రతిపాదన

స్కూళ్లు, కాలేజీల ఓపెన్ పై క్లారిటీ ఇవ్వని కేంద్రం

కరోనా కారణంగా దేశంలో స్కూళ్లు మూతపడ్డాయి. అయితే స్కూళ్లుపై ఓ నివేదిక పార్లమెంట్ స్థాయి సంఘానికి నివేదిక సమర్పించింది. స్కూళ్ల రద్దీ నివారణకు రోజు విడిచి రోజుకానీ, ఉదయం-మధ్యాహ్నం షిఫ్టుల్లో కానీ కాస్లులు నిర్వహించాలని సూచించింది. ఏడాదిన్నరగా స్కూళ్లు మూసివేయడంతో విద్యార్థులపై మానసిక ప్రభావం చూపుతోందని.. చిన్నారులు, కాలేజ్ విద్యార్థులు ఇంటి 4 గోడలకే పరిమితం అవ్వడం వల్ల పిల్లల్లో మానసిక పరివర్తన, తల్లిదండ్రుల్లో ఆందోళన వస్తుందని నివేదికలో చెప్పబడింది.

అయితే దేశ వ్యాప్తంగా కొన్ని చోట్ల కరోనా, డెల్టా వేరియంట్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంక్షల మధ్య స్కూళ్లు తెరవాలని ప్లారమెంట్ స్థాయి సంఘం కేంద్రానికి సూచన చేసింది.

తెలంగాణలో ఆగస్టు 16నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవాలని విద్యాశాఖ నిర్ణయం. అయితే కరోనా కేసుల దృష్టా ఆన్ లైన్ నిర్వహించాలని ఓ ప్రకటనలో పేర్కోంది. అయితే రాష్ట్రంలో కొన్ని విద్యా సంస్థలు ఆంక్షల మధ్య స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేశారు.

ఏపీలో కొవిడ్‌, డెల్టా కారణంగా..విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌ తరగతులు ప్రారంభించలేదు. ఆగస్టు16న పాఠశాలలను ప్రారంభిస్తున్నందున.. ఇంటర్‌ తరగతులు కూడా అదేరోజు ప్రారంభించాలని నిర్ణయించామని…ఆఫ్‌లైన్‌ తరగతులకు సిద్ధం కావాలని ప్రిన్సిపాళ్లకు నిర్దేశించారు. అయితే విద్యార్థులకు కొత్త బస్ పాస్ లు కూడా జారీ చేస్తున్నామని తెలిపారు. ధరఖాస్తును Online. apsrtcpass.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. ధరఖాస్తు ఫారం పూర్తి చేసి ఫోటోపైన, బోనఫైడ్ సర్టిఫికెట్ కాలమ్ లో ప్రిన్సిపల్ చేత సంతకం చేయించాలి. అయితే కాలేజ్ విద్యార్థులయితే అప్లికేషన్, టెన్త్ పాస్ మోమో జిరాక్స్, ఆధార్ జిరాక్స్, పాస్ పోర్టు ఫోటో తోపాటుగా అప్లికేషన్ కాలేజ్ ఫాంపై ప్రిన్సిపల్ సైన్ చేసి ఇవ్వాలని చెప్పారు. అయితే ఉచిత బస్ పాస్ లను 12ఏళ్లలోపు బాలికలు, బాలురకు, 18ఏళ్ల లోపు బాలికలకు ఇస్తామని RTC అధికారులు తెలిపారు.

 

 

 

 

 

 

స్కూళ్ల ఓపెన్ పై క్లారిటీ రాని ఢిల్లీ ప్రభుత్వం… ఇప్పటి వరకు ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు.. స్కూళ్లు, కాలేజీలు ప్రత్యక్షంగా తెరవడంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే నిపుణుల కమిటీ సూచన మేరకు స్కూళ్లను ఓపెన్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం.

ఒడిశాలో కరోనా, వర్ష బీభత్సంతో స్కూళ్లు ఆలస్యమయ్యాయి. జులై 26 నుంచి స్కూళ్లు, కాలేజీలు నిర్వహించాలని నిర్ణయం. పదో తరగతి, ఇంటర్ క్లాసులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సెప్టెంబర్ 1 నుంచి 9-12 క్లాసులు మొదలు పెట్టాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

యూపీలో ఆగస్టు 16 నుంచే కాలేజీల్లోనే 50శాతం మంది ఇంటర్ విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించింది.

కర్ణాటకలో స్కూళ్లు, కాలేజీల పై ఓ క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ,  విద్యార్థులను రెండు బ్యాచ్ లుగా విభజించి రోజు రోజు విడిచి క్లాసులు నిర్వహించాలని నిర్ణయం. అయితే 9-12 తరగతులకు ఈనెల 23 వరకు ఆన్ లైన్ క్లాస్ పెట్టాలని నిర్ణయం.

కరోనా నుంచి ఇప్పుడే ఇప్పుడే కోరుకుంటున్న మహారాష్ట్ర. అయితే విద్యార్థుల భవిష్యత్ పై ఓ నిర్ణయానికి వచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 17 నుంచి స్కూళ్లలోనే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని సర్కార్ ఆదేశించింది.

ఏది ఏమైనా ఆంక్షల మధ్య స్కూళ్లు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కరోనా, డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో చిన్నారులు, విద్యార్థులను స్కూళ్లుకు పంపిందేందుకు తల్లిందండ్రుల్లో ఆందోళన నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *