నరక చతుర్దశి అంటే ఏమిటి..? దీని ప్రత్యేకత ఏంటి.. ?
ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి. మనం ఆచరించే పండుగలలో ఒక రాక్షసుణ్ణి మరణాన్ని ఆనందంగా పండుగ చేసుకోవడమే ఈ పండుగనే నరక చతుర్దశి అంటారు.
నరక చతుర్దశికి గల పేర్లు ప్రయత్న చతుర్దశి, కాలా చౌదస్, కాళ చతుర్దశి, అంధకార చతుర్దశి అనే కొన్ని పేర్లు వ్యవహారంలో ఉన్నాయి. నరకంలో నివసించిన పూర్వీకులకు పుణ్యలోకం కలిగింప చేయడానికి, లేదా తమ తమ జీవితాల్లో ఇది నరకం అనే ప్రస్తావన రాకుండా జరిపే ఒక ఉత్సవంగా కూడా ఈ రోజున చెబుతారుని శాస్త్రాలలో చెబుతున్నారు.
భూదేవి జనక మహారాజుకు తన కుమారుని పెంపకం బాధ్యతను అప్పగించి వెళ్లిపోయింది. అపుడు అతడు పేరు భౌముడు. ఇతడి అకృత్యాలకు విసిగి వేసారిన జనకుడు భౌముడిని తీసుకెళ్లమని భూదేవికి చెప్పాడు. భూదేవి విష్ణుమూర్తిని ప్రార్థించగా.. విష్ణుమూర్తి భారతదేశపు ఈశాన్య ప్రాంతంలో అసమ (అస్సాం)ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఏర్పరచి, భౌముణ్ణి పట్ట్భాషిక్తుడిని చేశాడు. దీంతో బలగర్వితుడైన భౌముడు నరులను హింసిస్తూ పాలన చేయడంవల్ల నరకాసురుడు అని పేరు పొందాడు. అతను ఏర్పర్చిన రాజధాని పేరు ప్రాగ్జోతిషపురం. అంటే తూర్పున వెలిగే నరకమని అర్థము. ప్రజల ప్రార్థన మేరకు ధర్మసంస్థాపనకై సత్యభామను తీసుకుని శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చతుర్దశి రోజున చేశాడు.
చతుర్దశ్యాం తు యేదీవాన్ నరకాయ దదంతిచ
తేషాం పితృగణాస్సత్వా నరకాన్ స్వర్గ మాప్నుయః
ఈ స్లోకాన్ని చదువుతారు. నరక చతుర్దశి రోజున చేయాల్సింది. మరణించి పితృలోకాలకు వెళ్లిన మన పెద్దలను తలచుకొని, ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క దీపాన్ని మనింట్లో వెలిగించడం. నూనె పోసి వెలగించినదానినే దీపం అంటారు. పెట్టిన దీపాలను పై శ్లోకం పఠిస్తూదానం చేయాలి. ‘పితృలోకాల్లో వున్న మా పూర్వీకులందరికీ (ఈ ఒక దీపం) ఒక్కొక్కరికి ఈ దీపాలు వెలుగు చూపుతూ వారందర్నీ స్వర్గం చేరుకునేలా చేయుగాక!’ అని ఆకాంక్షించడం, ఇలా ఇవ్వడంలోని భావం.
శాస్త్రానుసారం జీవులు తాము చేసిన పాపాలకు తగిన శిక్ష పొందేది దుర్గతి చోటు. యమలోకంలో 84 లక్షల నరకాలు ఉన్నాయని…వాటిలో మిక్కిలి భయంకరములైన నరకాలు 27 ఉన్నట్లు పురాణాల్లో చెప్పబడింది.
ఈ లోకాలను రౌరవాది నరకాలు అంటారు. కాగా నరకానికి అధిపతి యముడు. కనుక నరక చతుర్దశినాడు యమప్రీతికై పూజాదులు నిర్వహించి దీపాలను వెలిగించాలట. ఇలా చేస్తే పితృదేవతలు నరక విముక్తులై స్వర్గానికి పోతారని పురాణాలో చెప్పబడింది.
ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే పవిత్ర స్నానాన్ని ఆచరిస్తే శరీరానికి దివ్యశక్తి కలుగుతుందంటారు. నరక చతుర్దశి రోజు, లోకాన్ని పాలించే లక్ష్మీదేవి తైలంలోనూ, గంగ నీటిలోనూ ఆవేశించి ఉంటాయని పద్మపురాణం చెబుతోంది.
భారత స్త్రీలందరూ సంప్రదాయం ఎంత గొప్పదంటే లోక కంటకుడైతే తన పుత్రుడని లెక్కచేయకుండా వధించవలసిందే అని చెప్పేటంత. అందుకే పుత్రుని బాధను భరించలేని భూదేవి తనభర్తతో మొరపెట్టుకుని నరకుణ్ణి వధించేసింది. నరకచతుర్దశి నాటి సాయంత్రం కనీసం ఐదు ప్రదేశాల్లో దీపాలు ఉంచాలి. ఇంటి దీపం, ధాన్యపుకొట్టు, రావిచెట్టు మొదట, వంటిల్లు, బావి దగ్గర దీపాలు వెలగించాలి. ఉత్తరాదిన కొందరు నాలుగు వీధుల కూడళ్లలో కూడా దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాల దర్శనంవల్ల నరక తిమిరం ఉండదు.
క్షుతిపా సామలాం జ్యేష్ఠామ లక్ష్మీం, నాశయామ్యహమ్
అభూతిమ సమృద్ధించ సర్వాం నిర్గుదమే గృహాత్
ఆకలి దప్పులతో కృశించే దైవ జ్యేష్ఠాదేవిని నేను నాశనం చేస్తాను. నా గృహం నుండి అభాగ్యాన్ని తొలగించి అనుగ్రహించు అని లక్ష్మీదేవిని నరకచతుర్దశినాడు ప్రార్థించాలి. గుజరాతీలు నరక చతుర్దశిని కాలచేదశ్ అంటారు. చివరగా దుష్ట్భావనలను, దుష్ట ఆలోచనలను కృష్ణ్భక్తి అనే ఆయుధంతో ఖండింపజేసి, జీవుడు భగవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది నరకచతుర్దశిలోని అంతరార్థం.