పాకిస్తాన్-ఆఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ నిరవధిక వాయిదా

పాకిస్తాన్-ఆఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ నిరవధిక వాయిదా
అఫ్గానిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించడంతో ఆ దేశ పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడి ప్రజల మద్దతి లేకుండా పోయింది. దీనిలో భాగంగానే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ నిరవధిక వాయిదా పడింది. అఫ్గానిస్తాన్‌లో ఏర్పడిన పరిస్థితుల దృష్యా సిరీస్‌ను వాయిదా వేసినట్లు ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన చేసింది.
అయితే తాలిబన్లు తాము క్రికెట్‌కు మద్దతిస్తామని.. క్రికెటర్లు భయపడాల్సిన అవసరం లేదని.. స్వేచ్చగా క్రికెట్ ఆడుకోవచ్చని మద్దతు తెలిపినప్పటికీ అఫ్గానిస్తాన్ క్రికెటర్లు భయపడుతూనే ఉన్నారు. అయితే తాలిబన్ ప్రకటన చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి సిరీస్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటన రావడం అక్కడి క్రికెట్ అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే శ్రీలంక లో సెప్టెంబర్ 1 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలుకావాల్సి ఉంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. సెప్టెంబర్ 1న తొలి వన్డే, 3న రెండో వన్డే, 5న చివరి వన్డే జరగాల్సి ఉంది. ఏదీ ఏమైనా తాలిబన్ల ఆక్రమణలతో మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.