పాకిస్తాన్ లో భూకంపం, రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.9గా నమోదు
పాకిస్తాన్ లో భూకంపం
రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.9గా నమోదు
20మందికిపైగా మృతి
200మందికిపైగా గాయాలు
పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో 20 మందిపైగా మృతి చెందారు. సుమారు 300 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని దగ్గరలోని స్థానిక ఆస్పత్రులకు తరలిస్తుస్నామని బలూచిస్తాన్ హోంమంత్రి మీర్ జియా ఉల్లా లాంగా తెలిపారు. మృతి చెందిన 20 మందిలో ఇద్దరు మహిళులు, ఆరుగురు చిన్నారులు ఉన్నారని హోంమంత్రి తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం నమోదైంది. బలూచిస్తాన్ ప్రావిన్సిస్ లో భూకంపం తీవ్రతగా అధికంగా ఉండటంతో పలు ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. సహాయక చర్యల్లో పాక్ ఆర్మీ పాల్గొందని తెలిపారు.