పోడు భూముల వ్యవసాయం చేసే వారికి గుడ్ న్యూస్

పోడు భూముల వ్యవసాయం చేసే వారికి గుడ్ న్యూస్
తెలంగాణలో పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు అక్టోబర్ మూడోవారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పోడు భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తరువాత కూడా ఒక్క గజం జాగ అటవీ భూమి భవిష్యత్తులో కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని, ఆక్రమించుకునేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులు చేపట్టాలని.. అవసరమైతే లా అండ్ ఆర్డర్ రక్షణతో అట్టివారిపై శిక్షలు కూడా తీసుకునేందుకు వెనకాడకూడదని సీఎం స్పష్టం చేశారు. అడవులను రక్షించేందుకు అధికారులు మానిటరింగ్ చేసుకోవాలని సీఎం సూచించారు.
పోడు భూముల సమస్యను పరిష్కరించే క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అయితే పోడు భూములపై అఖిలపక్ష నేతలకు అటవీ భూములు అన్యాక్రాంతమైన విధానంపై వారికి ప్రత్యక్షంగా చూపిస్తామని పేర్కొన్నారు. అటవీ పరిరక్షణ కమిటీలను నియమించేందుకు ప్రతిపక్షనేతలతో మాట్లాడి..విధి విధానాలను తయారు చేయాలని సీఎం అధికారులను అదేశించారు. అటవీ శాఖలో జరుగుతున్నఅన్యాక్రాంత భూములు, అడవీ నడిమధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించాలని సీఎం ఆదేశించారు, అట్టి వ్యవసాయం చేస్తున్న వారికి అటవీ అంచున భూమిని కేటాయించాలని అధికారులను ఆదేశించిన సీఎం. అటవీ అంచున వ్యవసాయం చేసుకునే వారికి పట్టా సర్టిఫికేట్లు ఇచ్చి, వ్యవసాయానికి నీటి సౌకర్యం, కరెంటు వంటి వసతులు కల్పించి, రైతుబంధు రైతుబీమాను కూడా వర్తింపచేసేలా చూడాలని అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్