ప్రముఖ సినీ నటి జయంతి (75) కన్నుమూత

ప్రముఖ సినీ నటి జయంతి (75) కన్నుమూత

ప్రముఖ సినీ నటి జయంతి 75 కన్నుమూత

కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నటి జయంతి

ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు

జయంతి గత 35 సంవత్సరాల నుంచి ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారు

జయంతి 1945 జనవరి 6న బళ్ళారి లో జన్మించారు

కన్నడ సినిమా జెను గూడు(1963)తో తెరంగేట్రం చేసిన జయంతి అనేక హిందీ, మరాఠీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించారు.

ఇప్పటి వరకు దాదాపు 500పైగా సినిమాల్లో నటించిన ఈమె 300 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.  తెలుగులో భార్య భర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి, జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, దొంగ మొగుడు, కొదమ సింహం, పెదరాయుడు, సైరా నర్సింహారెడ్డి చిత్రాల్లో నటించారు.

1949 జనవరి 6న శ్రీకాళహస్తిలో పుట్టిన జయంతి.. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడం వల్ల తల్లితో కలిసి మద్రాసులో అడుగుపెట్టారు. ప్రముఖ నర్తకి, నాట్య విదూషీమణి చంద్రకళ వద్ద నాట్యం నేర్చుకున్నారు. తోటి విద్యార్థులతో కలిసి కన్నడ సినిమా చిత్రీకరణ చూడటానికి వెళ్లినప్పుడు ప్రముఖ కన్నడ దర్శకుడు వైఆర్ స్వామి కమలకుమారిని చూసి ‘జేనుగూడ’ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా తీసుకున్నారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కమలకుమారి పేరు చాలా మందికి ఉండటం వల్ల ఆ పేరును జయంతిగా మార్చారు. ఎన్టీఆర్ తో కలిసి జగదేకవీరుని కథ, కుల గౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాల్లో నటించారు. అలాగే స్వర్ణ మంజరి, రైతుబిడ్డ, మాయదారి మమల్లిగాడు, పెదరాయుడు చిత్రాలు జయంతిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.
కన్నడ హీరో రాజ్ కుమార్​తో కలిసి 30 సినిమాల్లో కథానాయికగా నటించారు. 1965లో ‘మిస్ లీలావతి’ చిత్రానికి భారత ప్రభుత్వం ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందజేసింది. మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్​తో సత్కరించింది. జయంతి కళాకోకిల, అభినయ శారద బిరుదులు పొందారు. సినీరంగంలోనే కాదు రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన ఆమె.. 1998లో లోక్ శక్తి పార్టీ తరపున చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కోరటగీరె నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. జయంతి, రాజశేఖర్ దంపతులకు ఒకే ఒక్క కుమారుడు కృష్ణకుమార్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: