ఫోన్ పే వాడితే ఇక బాదుడే..!

ఫోన్ పే వాడితే ఇక బాదుడే..!

దేశ వ్యాప్తంగా ఫోన్ పే వాడుతుంటారు. ఫోన్ పే ద్వారా సూపర్ మార్కెట్ల గ్రాసరీ స్టోర్‌లో చెల్లింపుల నుంచి మనీ ట్రాన్స్ఫర్, బిల్లుల చెల్లింపు వరకు పలు రకాల సేవలు పొందొచ్చు. ఇంకా కొంత మంది ఫోన్ పే వాలెట్‌కు క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఫోన్‌పేతో పాటు ఇతర సంస్థలు కూడా ప్రాసెసింగ్‌ ఫీజులు వసూలు చేస్తున్నాయి. రూ.50 లోపు ఫోన్‌ రీఛార్జీలపై రుసుములు ఉండవని, రూ.50-100 రీఛార్జీలపై రూ.1, రూ.100 దాటితే రూ. 2, రూ.100కు 2.06 శాతం చార్జీ పడుతుది. అంటే మీరు రూ.200 యాడ్ చేసుకుంటే రూ.4.13 చార్జీ పడుతుంది. రూ.300 అయితే రనూ.6.19 చార్జీని ప్రయోగాత్మకంగా వసూలు చేయనున్నట్లు ఫోన్‌పే అధికార ప్రతినిధి వెల్లడించారు. రీఛార్జి లావాదేవీ యూపీఐ ద్వారా చేసినా, ప్రాసెసింగ్‌ రుసుము భారం పడుతుంది. యూపీఐ ఆధారిత లావాదేవీలపై ఛార్జీలు విధించడం ప్రారంభించిన మొదటి డిజిటల్‌ చెల్లింపుల సంస్థగా ఫోన్‌పే నిలవనుంది. పోటీ సంస్థలు ఈ లావాదేవీలపై ఛార్జి వసూలు చేయడం లేదు. థర్డ్‌ పార్టీ యాప్‌లలో అధిక లావాదేవీలను ఫోన్‌పే నిర్వహిస్తోంది. సెప్టెంబరులో 165 కోట్ల యూపీఐ లావాదేవీలను ఫోన్‌పే నిర్వహించి, ఈ విభాగంలో 40 శాతం వాటా పొందింది.

కంపెనీ అడిషనల్ కన్వీనియన్స్ ఫీజు రూపంలో ఈ చార్జీలను వసూలు చేస్తోంది. కేవలం క్రెడిట్ కార్డు లావాదేవీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అదే యూపీఐ, డెబిట్ కార్డు ద్వారా ఫోన్ పే వాలెట్‌కు డబ్బులు యాడ్ చేసుకుంటే ఎలాంటి చార్జీలు పడవని గమనించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *