మద్రాస్ హైకోర్టులో హీరో సూర్యకు చుక్కెదురు

మద్రాస్ హైకోర్టులో హీరో సూర్యకు చుక్కెదురు

రూ.3కోట్లు చెల్లించాల్సిందేనన్న మద్రాస్ హైకోర్టు

మద్రాస్ హైకోర్టులో హీరో సూర్యకు చుక్కెదురు

రూ.3కోట్లు పన్ను ఎగ్గోట్టారన్నఆరోపణలపై ఆదాయపు పన్నుశాఖ ఇచ్చిన పిటిషన్ ను వ్యతిరేకిస్తూ హీరో సూర్య.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో హీరో సూర్య తన ఆదాయానికి తగ్గట్టు పన్నులు చెల్లించండం లేదనే కారణంతో 2010లో ఇన్ కమ్ టాక్స్ శాఖ అధికారులు  ఏక కాలంలో హీరో సూర్యకు సంబంధించిన ఇళ్లు, వ్యాపార స్థలాలు, బంధువుల ఇళ్లపై సోదాలు నిర్వహించారు.

ఇన్ కమ్ టాక్స్ లెక్కల్లో లేని ఆదాయాలకు మించి మొత్తం రూ.3.11 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేశారు. అయితే ఆదాయపు పన్ను అధికారులు జారీ చేసిన నోటీసులో వడ్డీ మినహాయించాలని కోరుతూ సూర్య మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అందుకు భిన్నంగా హైకోర్టు మాత్రం సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వ్యక్తులు మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని చెబుతూ.. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది.గతంలో పేరోందిన హీరోలు కూడా ఇన్ కమ్ టాక్స్ ఎగ్గొట్టిన కేసులో పలుమార్లు చివాట్లు పెట్టిన మద్రాస్ హైకోర్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *