మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌..

మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌..

మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌..

ఇండియాలో ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్ కంపెనీలు నాలుగు, ఐదు కంపెనీలు వెలిశాయి. ఈ కంపెనీలకు పోటీగా మరో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది. అదేంటో చూద్దామా మరీ..

ఇండియాలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంఛ్ చేసింది మరో కంపెనీ. ఈ కంపెనీ దీనిని ఈ బైకును “ రగ్డ్” అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది రెండు మోడల్స్ లో లభిస్తాయి.

ఫస్ట్ మోడల్ బైకు: తొలి రగ్డ్ g1 ధర రూ.84,999గా నిర్ణయించారు.

రెండో మోడల్ ధర రగ్డ్ g1 ప్లస్ ధర రూ.1,04,999గా నిర్ణయించారు.

అయితే నవంబర్ 2021 తొలి వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రొత్సహించేందుకు వివిధ రాష్ట్రాలు సబ్సిడీ కూడా ప్రకటించాయి. దీనిలో భాగంగానే ఈబైక్ గో రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై సబ్సిడీ కూడా ఉంది.

ఈబైక్ గో రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3kw మోటార్ ఉంది. ఇది దాని డ్యూయల్ 2kwh బ్యాటరీ ప్యాక్ ద్వారా గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. 0 శాతం నుంచి ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారు 3.5 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 160 కి.మీ. వెళ్లోందని ఈబైక్ గో పేర్కొంది. ఈ బైకు Steel Frameతో క్రెడిల్ ఛాసీస్ పై నిర్మించబడింది. సుమారు 30 లీటర్ల స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిలో 12 బిల్ట్ ఇన్ స్మార్ట్ సెన్సార్లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా ఎలక్ట్రిక్ బైక్ లాక్, అన్ లాక్ చేయవచ్చు. దీనిలో యాంటీ థెఫ్ట్ ఫీచర్ కూడా ఉంది. ఈ యాంటీ థెఫ్ట్ ఫీచర్ వల్ల అదనపు భద్రత లభిస్తుంది. ఈ స్కూటర్ లో మరో అధ్బుతమైన ఫ్యూచర్ ఉంది. దీనిని ఎవరైనా టచ్ చేస్తే ఆటోమెటిక్ గా అలారం మొగుతుంది. దీనిలో గుగుల్ ఆధారిత ఫ్లీట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉంది. ప్రస్తుతానికి ఈ స్కూటర్‌ను ఇండియాలోనే తయారు చేశారు. ఈ స్కూటర్ ఛాసిస్ 7 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. ఇప్పటికే ఎన్నో ఎలక్ట్రికల్ వాహన కంపెనీలు వొచ్చాయి.. మరి ఈ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో ఎంత వరకు నిలబడుతుందో వేచి చూడాలి. అయితే ఈ బుక్ చేసుకోవాలంటే  వెబ్ సైట్ లో రూ.499 రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని కంపెనీ ఎండీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: